News

కేజ్రీవాల్ కార్యాలయ డిప్యూటీ సెక్రటరీపై వేటు

386views

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ కార్యాలయంలో డిప్యూటీ కార్యదర్శి ప్రకాష్ చంద్ర ఠాకూర్‌ను అవినీతి ఆరోపణలపై లెప్టనెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా సస్పెండ్ చేశారు. అవినీతి ఆరోపణలపై సీఎం కార్యాలయంలోని డిప్యూటీ సెక్రటరీ ప్రకాష్ చంద్ర థాకూర్‌ ని సస్పెండ్ చేశారు. మరో ఇద్దరు సబ్-డివిజనల్ మెజిస్ట్రేట్ అధికారులు హర్షిత్ జైన్, దేవేంద్ర శర్మలపై కూడా సస్పెన్షన్ వేటు వేశారు. వీరిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలంటూ లెఫ్టనెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఆదేశాల్లో పేర్కొన్నారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి