News

గోరక్షకులపై తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్న నటి సాయి పల్లవి

478views

* క్షమాపణలు కోరుతూ వీడియో విడుదల

త కొన్నిరోజుల నుంచి తనపై జరుగుతున్న ప్రచారంపై నటి సాయిపల్లవి వివరణ ఇచ్చారు. ఈమేరకు తాజాగా ఆమె ఓ వీడియో ఫైల్‌ని షేర్‌ చేశారు. ‘విరాటపర్వం’ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో కశ్మీర్ పండిట్స్, గోహత్యలపై వ్యాఖ్యలు చేశారు. ఆమె వ్యాఖ్యలపై భజరంగ్ దళ్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తాను చెప్పిన విషయాలను పూర్తిగా పరిగణలోకి తీసుకోకుండా కేవలం కొన్ని మాటల్ని మాత్రమే తీసుకుని కొంతమంది ఇలాంటి వార్తలు సృష్టించారని ఆమె అన్నారు. తన మాటల వల్ల ఎవరైనా ఇబ్బందిపడి ఉంటే క్షమించమని కోరారు. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లోనూ తనకి సపోర్ట్‌ చేసిన వారందరికీ కృతజ్ఞతలు చెప్పారు.

గత కొన్నిరోజుల నుంచి నాపై వస్తోన్న విమర్శలు.. నా వ్యాఖ్యలను తప్పుదోవ పట్టిస్తూ జరుగుతున్న ప్రచారానికి సంబంధించి స్పష్టత ఇచ్చేందుకే మీ ముందుకువచ్చాను. ఇప్పుడు నా అభిప్రాయాన్ని చెప్పడానికి కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకంటే నా మాటల వల్ల ఎవరూ ఇబ్బందిపడకూడదు. ఒకవేళ నా మాటలతో మిమ్మల్ని ఇబ్బందిపెట్టి ఉంటే క్షమించండి. ఇటీవల నేనిచ్చిన ఓ ఇంటర్వ్యూలో మీరు లెఫ్ట్‌ వింగ్‌కి మద్దతిస్తారా? రైట్‌ వింగ్‌కి మద్దతిస్తారా? అని అడిగారు. దానికి నేను వారికి, వీరికి అని కాకుండా ముందు మనం మంచి మనుషులుగా జీవించాలనే ఉద్దేశంతో సమాధానం చెప్పాను. కానీ, నా మాటల్ని కొంతమంది తప్పుగా అర్థం చేసుకుని ఏవేవో ప్రచారం చేశారు. నా దృష్టిలో హింస అనేది ముమ్మాటికీ తప్పే. ఒక డాక్టర్‌గా ప్రాణం విలువ నాకు తెలుసు. ఒకరి ప్రాణం తీసే హక్కు మరొకరికి లేదు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ నాకు సపోర్ట్‌గా ఉన్న వాళ్లందరికీ నా కృతజ్ఞతలు” అని సాయిపల్లవి పేర్కొంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.