
480views
వాషింగ్టన్: అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. అలబామాలోని ఓ చర్చిలో జరిగిన కాల్పుల ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అనుమానితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
బర్మింగ్‌హామ్ సబర్బ్ వెస్టావియా హిల్స్‌లో ఉన్న సెయింట్ స్టీఫెన్స్ ఎపిస్కోపల్ చర్చిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తీవ్రంగా గాయపడిన ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. ప్రాణాలు కోల్పోయిన వ్యక్తిని గుర్తించాల్సి ఉంది. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు.





