News

మరోసారి బయటపడిన చైనా-పాక్​ దోస్తీ..

456views

న్యూఢిల్లీ: చైనా-పాక్​ దోస్తీ మ‌రోసారి బట్టబయలైంది. రెండు దేశాల మధ్య సైనిక బంధం మరింత బలోపేతమైంది. పాకిస్తాన్ సైనిక దళాల ప్రధానాధికారి ఖమర్‌ జావెద్‌ బజ్వా నేతృత్వంలో ఆ దేశ త్రివిధ దళాల ప్రతినిధి బృందం.. చైనాలో జూన్‌ 9 నుంచి 12 వరకు పర్యటించింది. చైనా సైనిక, ప్రభుత్వ విభాగాల ప్రతినిధులతో విస్తృత స్థాయి చర్చలు జరిపింది. ఆదివారం బజ్వా, చైనా కేంద్ర సైనిక కమిషన్‌ వైస్‌ ఛైర్మన్‌ ఝాంగ్‌ యౌక్సికా మధ్య కీలక భేటీ జరిగింది.

చైనా, పాక్‌ మధ్య సైనిక బంధాన్ని బలోపేతం చేయడంపై ఇరువురూ చర్చించారు. భారత్‌ పేరు ప్రస్తావించకున్నా ఇది సవాళ్లతో కూడిన సమయం అని పేర్కొంటూ రక్షణ సహా ఉగ్రవాద నిరోధక సహకార వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఈ భేటీలో నిర్ణయించారు. రెండు దేశాల త్రివిధ దళాల స్థాయిలో శిక్షణ, సాంకేతిక సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని తీర్మానించారు. వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవడం, పరస్పర ప్రయోజనాలతో ముడిపడిన అంశాల్లో ఇచ్చిపుచ్చుకునే ధోరణిని కొనసాగించాలని బజ్వా, యౌక్సికా భేటీలో నిర్ణయించారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి