News

చేతిపై రేపిస్ట్ క‌లీమ్ పేరు రాసుకుని బాలిక ఆత్మహత్య!

401views

కౌశాంబీ: రెండేళ్ళుగా అత్యాచారానికి గురవుతున్న ఓ బాధితురాలు… త‌న‌ చేతిపై నిందితుడి పేరు రాసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని కౌశాంబీలో వెలుగుచూసింది. పోలీసులు నిందితుడిని అరెస్ట్​ చేశారు. బాధితురాలు వేధింపులకు గురవుతున్నట్టు తల్లిదండ్రులకు ముందే తెలిసినా వారు పోలీసులకు ఫిర్యాదు చేయ‌లేదు.

బాధితురాలిని ప్రేమ పేరుతో ముగ్గులోకి దించిన నిందితుడు కలీమ్​.. ఆమెకు సంబంధించిన ఓ వీడియోను చిత్రీకరించాడు. వీడియోను వైరల్​ చేస్తానని బెదిరిస్తూ బాధితురాలిపై తరచూ అచ్యాచారానికి పాల్పడేవాడు. కొన్నాళ్ళ‌కు బాధితురాలు ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పగా వారు ఆమెను వేరే గ్రామంలోని బంధువుల ఇంటికి పంపించి అక్కడే చదువుకునేలా ఏర్పాట్లు చేశారు.

అయినా నిందితుడు వేధించడం మానలేదు. దీంతో విసిగిపోయిన బాధితురాలు ఇంటికి తిరిగివచ్చేసింది. ఈ క్రమంలో శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇంటి నుంచి ఎలాంటి శబ్దం రాకపోవడంపై అనుమానించిన పొరిగింటి వారు విషమ పరిస్థితిలో ఉన్న బాధితురాలిని గుర్తించారు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా అక్క‌డ ప్రాణాలు విడిచింది.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి