News

విజయవంతంగా యుగ తులసి గో వితరణ

635views

భాగ్య‌న‌గ‌రం: అక్రమ రవాణా నుండి రక్షించిన గోవులను గో ఆధారిత వ్యవసాయ రైతులకు ఉచితంగా అందించే గో వితరణ కార్యక్రమం యుగ తులసి గో మహా క్షేత్రంలో సోమ‌వారం విజయవంతంగా జరిగింది.

యుగ తులసి ఫౌండేషన్ చైర్మన్ శ్రీ కె.శివ కుమార్, సేవ్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీ విజయ్ రామ్ గార్ల చేతుల మీదుగా 17 ఆవులు, 25 నందులను మొదటి విడతలో భాగంగా 10 జిల్లాల నుండి వచ్చిన రైతులకు పంపిణీ చేశారు.

గో ఆధారిత వ్యవసాయం కోసం రైతులకు గోవులను ఉచితంగా అందించడం పట్ల రైతులంతా తమ సంతోషాన్ని వ్య‌క్తం చేశారు. గోవులను కంటికి రెప్పలా కాపాడుకుంటామని యుగ తులసి ఫౌండేషన్‌కి లిఖిత పూర్వకంగా హామీ పత్రాలు రాసిచ్చిన రైతులు యుగ తులసి ఫౌండేషన్‌కి తమ కృతజ్ఞతలు తెలిపారు.

గో వితరణ కార్యక్రమంలో ఇది కేవలం మొదటి ఫేజ్ మాత్రమే అని భవిష్యత్‌లో మరిన్ని గోవులను గో ఆధారిత రైతులకు ఉచితంగా అందించడానికి యుగ తులసి సిద్ధంగా ఉందని చైర్మన్ చెప్పారు. గోవులను రైతులు సద్వినియోగపరచుకోవాలని, గోవుల రక్షణకు ఎటువంటి భంగం కలిగినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామ‌ని రైతులకు తెలిపారు. ఇలా గోవులను రైతులకు ఉచితంగా అందించే ఆసక్తి ఉన్న వారు ముందుకి రావాలని సేవ్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీ విజయ్ రామ్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి