కాశ్మీర్లో మళ్లీ అలజడి మొదలైంది. అమాయక హిందువుల ఊచకోత మళ్ళీ మొదలైంది. ఒక్క 10 రోజుల వ్యవధిలోనే 8 మంది కాశ్మీరీ హిందువులు ఉగ్రవాదుల తూటాలకు బలయ్యారు. ఈ దాడుల వెనుక ఉన్నది నిర్ద్వంద్వంగా ఇస్లామిక్ శక్తుల సుదీర్ఘ వ్యూహం మాత్రమే. అందులో ఎలాంటి సందేహమూ అవసరం లేదు.
370 ఆర్టికల్ రద్దు అనంతరం కేంద్ర ప్రభుత్వం కల్పించిన పునరావాసం వల్ల, ఇచ్చిన భరోసా వల్ల మూడు దశాబ్దాల క్రితం తమ మాతృభూమిని వదిలివెళ్లిన కాశ్మీరీ హిందువులు, వారి సంతతి కొంతమంది తిరిగి తమ జన్మ స్థానాన్ని చేరుకున్నారు. వారికి ప్రభుత్వం ప్యాకేజీలు, పునరావాసం, ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించింది.
మరోవైపు మొన్న మొన్నటి వరకూ తుపాకీలు పట్టుకుని, రొమ్ము విరుచుకుని తిరిగిన ఇస్లామిక్ తీవ్రవాద మూకలన్నీ చెల్లాచెదురైపోయాయి. వాటి కీలక నాయకులందరూ హతమైపోయారు. అల్ బదర్, అన్సర్ ఘజావత్ వంటి అనేక సంస్థలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. 70 ఏళ్ల పాటు ఆడిందే ఆటగా, పాడిందే పాటగా చెలాయించిన కాశ్మీర్ వేర్పాటువాద రాజకీయ పార్టీలు కూడా చేష్టలుడిగి చూస్తుండడం తప్ప చెయ్యగలిగింది ఏమీ లేకపోయింది. ఇప్పుడు వాళ్ళకిక మిగిలింది పరిమిత శక్తి, వనరులు, కొందరు స్థానిక ముల్లాలు, ముస్లిముల సహాయ సహకారాలు మాత్రమే.
అయినప్పటికీ వాళ్లు ఎప్పట్లాగే హిందువులను భయభ్రాంతులను చెయ్యాలని భావించారు. అందుకే తమకు అందుబాటులో ఉన్న పరిమిత వనరులతోనే హిందువులపై దాడులు మొదలుపెట్టారు. ఈ క్రమంలో వారికున్న ప్రధాన బలం కాశ్మీర్ వేర్పాటు వాద పార్టీలు, స్థానికులు, మీడియా, ప్రభుత్వ యంత్రాంగాలలోని కొందరు వ్యక్తులు మాత్రమే. వాళ్ళ సహకారంతో కాశ్మీర్లో ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన అమాయక హిందువులను లక్ష్యంగా చేసుకుని వారిపై దాడులు మొదలుపెట్టారు. ఓ కానిస్టేబుల్ ని, టీవీ నటిని, రెవెన్యూ ఉద్యోగిని, టీచర్ ని, బ్యాంకు ఉద్యోగిని, కార్మికులని, మరికొందరిని హత్య చేశారు. దీంతో సహజంగానే కాశ్మీర్లో పునరావాసం పొందిన హిందువులలో అలజడి మొదలైంది. తమను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరుతూ సుమారు 4000 మంది హిందువులు ఆందోళన చేపట్టారు. సరిగ్గా చెప్పాలంటే…. ఇస్లామిక్ వేర్పాటువాద, ఉగ్రవాద నాయకులు ఏదైతే కోరుకున్నారో సరిగ్గా అలాగే స్పందించారు. దానికి అక్కడి హిందువులను మనమేమీ తప్పుపట్టలేం.
అయితే ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే కాశ్మీర్ లోని వేర్పాటు వాద పార్టీలు, ఒక వర్గం మీడియా ఇప్పుడు కాశ్మీర్లో జరిగిన హిందువుల హత్యలను కేంద్ర ప్రభుత్వ వైఫల్యంగా చూపే ప్రయత్నం చేస్తూ ఉండడం. 30 ఏళ్ల క్రితం 5 లక్షల మంది హిందువులు కాశ్మీర్ నుంచి తరిమి వేయబడ్డప్పుడు వీళ్లెవరూ హిందువుల పక్షాన నిలబడి మాట్లాడలేదు. వారిని రక్షించే ప్రయత్నం చెయ్యలేదు. ఉగ్రవాద ముఠాల నాయకులతో చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. తామే అతి పెద్ద భారత్ వ్యతిరేకులమని చాటుకునేందుకు పరస్పరం పోటీలు పడ్డారు. కాశ్మీర్ భారత్లో అంతర్భాగం కాబోదని పదే పదే ప్రకటించారు. దేశ విదేశీ పత్రికలలో పుంఖానుపుంఖాలుగా వ్యాసాలు వెలువరించారు. వేర్పాటువాద మద్దతుదారుల్ని మేథావులుగా మిగతా దేశానికి పరిచయం చేశారు. కాశ్మీర్ ఉగ్రవాదుల్ని కాశ్మీర్ స్వాతంత్ర పోరాట యోధులుగా కీర్తించారు. సైనికులపై, పోలీసులపై జరిగే రాళ్ల దాడులను కాశ్మీరీ ముస్లిముల ఆత్మరక్షణ పోరాటంగా అభివర్ణించారు. వేలాది మంది హిందువులు, సైనికులు, పోలీసులు మరణించినప్పుడు వాళ్లెవరూ కించిత్ కూడా చింతించలేదు. ఆ రాళ్ల దాడులలో కళ్ళు పోయి, కాళ్లు పోయి, చేతులు పోయి ఇప్పటికీ దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్న పోలీసులు, సైనికులు ఎందరో ఉన్నారు. వారిపై వీరెవ్వరూ ఏనాడూ పిసరంత సానుభూతి చూపిన పాపాన పోలేదు. ఇప్పుడు మాత్రం హఠాత్తుగా కాశ్మీర్లో జరుగుతున్న హిందువుల హత్యలు దురదృష్టకరమైన ఘటనలుగా వారికి కనిపిస్తున్నాయి. ప్రభుత్వ వైఫల్యంగా కనిపిస్తోంది.
మరి 30 ఏళ్ల క్రితం కాశ్మీర్లో హిందువులపై ఉగ్రవాద మూకలు మరియు స్థానిక ముస్లిములు సంయుక్తంగా జరిపిన మారణకాండ ఎవరి వైఫల్యం? హిందువుల తరిమివేత ఎవరి వైఫల్యం? హిందువుల ఇళ్ళు, ఆస్తుల లూటీ, దురాక్రమణ ఎవరి వైఫల్యం? జమ్మూ, ఢిల్లీ వంటి ప్రాంతాలలో పునరావాస శిబిరాలలో దుర్భర జీవితాలను అనుభవిస్తూ ఉండిన హిందువులపై అప్పటి ప్రభుత్వాలు చూపిన నిర్లక్ష్యం ఎవరి వైఫల్యం?
సరే ఇంత మాట్లాడుతున్నవారు హిందువులపై జరుగుతున్న ఈ దాడులను ఆపటానికి ఏమైనా పరిష్కారం చూపుతున్నారా? అంటే… అదీ లేదు. ఇలా హిందువులపై దాడులకు తెగబడుతున్న ఉగ్రవాదులపై, సాధారణ పౌరుల ముసుగులో వారికి మద్దతునిస్తున్న స్థానిక ముస్లిములు, కాశ్మీరీ రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమిస్తే భారత ప్రభుత్వం మైనారిటీ ముస్లిములపై అఘాయిత్యాలకు పాల్పడుతోందని, అణచివేతకు గురిచేస్తోందని ప్రపంచవ్యాప్తంగా దుష్ప్రచారానికి పాల్పడేది వీళ్లే. దశాబ్దాల కుట్రలో భాగమే ఇదంతా. ప్రపంచవ్యాప్తంగా ఇస్లాం వ్యాప్తికై శతాబ్దాలుగా వారు అనుసరిస్తూ వస్తున్న అల్ తకియా, దారుల్ హరబ్, దారుల్ ఇస్లాంలలో భాగమే ఇదంతా. ఇప్పుడు కాశ్మీర్ లో జరుగుతున్నది దార్ ఉల్ ఇస్లాం. అంటే ముస్లిములు మెజారిటీగా ఉన్న ప్రాంతంలో ఎట్టి పరిస్థితులలోనూ ఇతరుల ప్రవేశాన్ని, నివాసాన్ని అంగీకరించకపోవడం. వారిని బెదిరించటం, బాధించటం, తరిమికొట్టటం, అవసరమైతే చంపెయ్యటం. ఇది ఖురాన్ లో చెప్పిందే. శతాబ్దాలుగా ప్రపంచ చరిత్రలో జరిగిన, జరుగుతున్న మారణహోమానికి కారణమేమిటో అర్థమైందిగా?
నిజానికి ఇప్పుడు జరిగింది ప్రభుత్వ వైఫల్యం కానేకాదు. సాఫీగా సాగుతున్న ప్రయాణంలో హఠాత్తుగా జరిగే ఒక ప్రమాదం వంటిది మాత్రమే. అయితే ఈ ప్రమాదం వెనుక ఇందాకే మనం చెప్పుకున్నట్లుగా కాశ్మీరులో ఎక్కడో ఏమూలో నక్కి ఉన్న కొందరు తీవ్రవాదుల పాత్ర ఉంది. ప్రస్తుత పరిస్థితులలో స్థానిక ముస్లిముల సహకారం లేకుండా ఇలాంటి ఘటనలు జరిగే అవకాశమే లేదు. స్థానిక రాజకీయ పార్టీల మద్దతు బహిరంగ రహస్యం. ఇలాంటి నేపథ్యంలో కాశ్మీర్లో పరిస్థితులను చక్కబెట్టే సవాలును కేంద్ర ప్రభుత్వం మనసా వాచా కర్మణా స్వీకరించింది. ఈ సవాలు ఎంత కఠినతరమైనదో, ప్రమాదకరమైనదో కాశ్మీర్ పరిస్థితులపై అవగాహన ఉన్న వారెవరికైనా ఇట్టే అర్థమవుతుంది. ఏ తీవ్రవాది ఎక్కడ ఏ మసీదులో, ఏ మదర్సాలో, ఏ ఇంట్లో నక్కి ఉంటాడో చెప్పడం చాలా కష్టం. ఏ కూరగాయలమ్మేవాడో, ఏ పచారీ కొట్టు వాడో, ఏ కూల్ డ్రింక్ షాప్ వాడో, ఈ టాక్సీ డ్రైవరో….. ఎవరు ఉగ్రవాదో, ఎవరు సాధారణ పౌరుడో, ఎవరు ఇన్ఫార్మరో కనిపెట్టి పట్టుకోవడం ఎలాగ? అయినప్పటికీ ఈ అతిపెద్ద సవాలును కేంద్ర ప్రభుత్వం, రక్షణ దళాలు సమర్థవంతంగానే నిర్వహిస్తున్నాయి. ఎందరో ఉగ్రవాదుల్ని ఏరి పారేశారు. వారి సమర్థకుల్ని జైళ్ళలో తోశారు. అక్రమ చొరబాట్లను దాదాపు పూర్తిగా కట్టడి చేశారు. అయినా సరే ఎక్కడో ఏ మూలనో నక్కిన నక్కలు అప్పుడప్పుడూ ఇలా ఊళలు వేస్తూ ఉన్నాయి.
అయితే అదే సమయంలో అక్కడి హిందువులను సైతం ప్రాణాలకు తెగించి అక్కడే నివాసం ఉండాలని ఎవ్వరూ బలవంతం చేయలేరు. అట్లని మళ్లీ తిరిగి వారిని వేరే ప్రాంతాలకు తరలించడమూ సబబు కాదు. దానివల్ల కాశ్మీర్ సమస్య మళ్లీ మొదటికి వస్తుంది. అయితే దీనికి పరిష్కారం ఏమిటి? ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క ప్రాణాన్ని కూడా పోనివ్వమని ప్రభుత్వం వారికి భరోసా ఇవ్వాలి. అందుకు తగిన విధంగా వారికి రక్షణ కల్పించాలి. దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి హిందువులను కాశ్మీర్ కు తీసుకువెళ్లి వారికి అక్కడ స్థిర నివాసాలను, ఉద్యోగ వ్యాపారాలను ఏర్పాటు చేయాలి. అవసరమైతే వారి నివాస ప్రాంతాలలో, పనిచేసే చోట పెద్ద ఎత్తున రక్షణ వలయాన్ని ఏర్పాటు చేయాలి. ఇంకా అవసరమైతే ఆత్మరక్షణ కోసం హిందువులకు ఆయుధాలు ఇవ్వడంపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలి. అనేక పరిమితుల మధ్య కూడా ప్రభుత్వం కాశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాల కట్టడికి, హిందువుల పునరావాస కల్పనకు ఎంతగానో కట్టుబడి కృషి చేస్తున్నది. ప్రభుత్వం అప్పుడే రక్షణ చర్యల దిశగా ఉపక్రమించింది కూడా. నిన్ననే వివిధ ప్రాంతాలలో పనిచేసే 177 మంది కాశ్మీరీ హిందువులను సురక్షితమైన ప్రాంతాలకు బదిలీ చేసింది. భవిష్యత్తులో మరింత సమర్థవంతంగా, కఠినంగా వ్యవహరించి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేసే అవకాశం ఉంది. నిజానికి కాశ్మీర్ లోని ఉగ్ర మూకలను, వారికి సహకరిస్తున్న శక్తులను ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదు. తాజా హత్యలతో వారు అన్ని హద్దులనూ అతిక్రమించారు. ఇక దెబ్బకుదెబ్బ తప్పదు. అన్ని మొహమాటాలనూ వీడి వారికి తగిన గుణపాఠం చెప్పి తీరాలి. ఇంతకు పదింతల నొప్పి కలిగించాలి. ఆ దిశగా ప్రభుత్వం ఖచ్చితంగా పయనిస్తుందని ఆశిద్దాం. కాశ్మీర్లో మరిన్ని సానుకూల పరిణామాలకై వేచి చూద్దాం. భారత్ మాతాకీ జై.