News

పీఎం శ్రీస్కూల్స్‌ను ప్రారంభించనున్న కేంద్రం

473views

న్యూఢిల్లీ: నూతన జాతీయ విద్యా విధానం అమలులో భాగంగా కేంద్ర ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. భవిష్యత్‌కు అనుగుణంగా విద్యార్థులను సన్నద్ధం చేయాలనే లక్ష్యంతో ‘పీఎం శ్రీ స్కూల్స్​’ను ప్రారంభించనుంది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్​ ప్రకటించారు. నూతన జాతీయ విద్యావిధానంపై గుజరాత్​లో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

ఈ పాఠశాలలను నూతన విద్యావిధానానికి ప్రయోగశాలగా అభివర్ణించారు. ఆజాదీ కా అమృత్​ మహోత్సవ్​ వేడుకలు జరుపుకుంటున్న ఈ తరుణంలో నేషనల్​ అచీవ్​మెంట్​ సర్వే 2021 తమలో విశ్వాసాన్ని నింపిందన్నారు ప్రధాని. విద్యా రంగంలోని లోపాలు సరిదిద్దుకుని.. వ్యవస్థను పటిష్ఠ పరిచి నాణ్యమైన విద్య అందించడానికి రాష్ట్రాలు కృషి చేస్తున్నాయని ఈ సర్వే స్పష్టం చేసిందని గుర్తుచేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి