News

దేశంలో మంకీపాక్స్ కేసులు లేవు – కేంద్రం స్పష్టీకరణ

493views

ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలను మంకీపాక్స్ కేసులు వణికిస్తున్నాయి. 25కు పైగా దేశాలకు ఈ వ్యాధి వ్యాపించగా గత పది రోజులుగా భారత్లో మూడు మంకీపాక్స్ అనుమానితులకు టెస్టులు చేయగా, నెగిటివ్ వచ్చింది. ‘దేశంలో ఇంతవరకు మంకీపాక్స్ కేసు నమోదు కాలేదు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి వచ్చిన మూడు శాంపిల్స్ రిపోర్టు నెగిటివ్ వచ్చింది’ అని కేంద్రం తాజాగా ప్రకటించింది. అయినప్పటికీ ప్రజలు జాగ్రత్తలు పాటించాలని. అయితే అనవసర భయాందోళనలకు గురి కావలసిన అవసరం లేదని కూడా ప్రభుత్వం ప్రకటించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.