
469views
తిరప్ : అసోం-అరుణాచల్ ప్రదేశ్ మధ్య సరిహద్దు వివాదం వచ్చే ఏడాదికల్లా పరిష్కారమవుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్‌లో రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన తిరప్ జిల్లా, నరోత్తమ్ నగర్‌లో ఉన్న రామకృష్ణ మిషన్ ఆశ్రమాన్ని సందర్శించారు.
ఆయనతోపాటు కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రామకృష్ణ మిషన్ ఆశ్రమం స్వర్ణోత్సవాల సందర్భంగా అమిత్ షా, కిరణ్ రిజిజు ప్రత్యేక పూజలు చేశారు. ఇదిలావుండగా, లోహిత్ జిల్లాలోని పరశురామ్ కుండ్ వద్ద భగవాన్ పరశురామ్ 51 అడుగుల ఎత్తయిన విగ్రహానికి అమిత్ షా శంకుస్థాపన చేస్తారు.





