
-
కోర్టు హెచ్చరించినా పట్టించుకోని వైనం
-
పినరయి విజయన్ ప్రభుత్వంపై విమర్శల వెల్లువ
తిరువనంతపురం: ఇంటెలిజెన్స్ నివేదికలను పట్టించుకోకుండా, కేరళలోని పినరయి విజయన్ నేతృత్వంలోని మార్క్సిస్ట్ ప్రభుత్వం సున్నితమైన అలప్పుజా జిల్లాలో ఆదివారం జరిగే పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్‌ఐ) సదస్సు, ర్యాలీకి అనుమతి ఇచ్చింది. భద్రతా కారణాలను చూపుతూ, అదే రోజు జరగాల్సిన బజరంగ్ దళ్ వాహన ర్యాలీని అదే కేరళ ప్రభుత్వం నిషేధించింది.
ఇస్లామిక్ టెర్రరిస్టులను శాంతింపజేయడానికి, పరిపాలన జిల్లా, చుట్టుపక్కల ఉన్న అన్ని వాహనాల రాకపోకలను నిషేధించింది. పీఎఫ్ఐI క్యాడర్‌ను కలిగి ఉన్నవారిని మినహాయించింది. ఆ ప్రాంతంలో పార్కింగ్‌ను కూడా నిషేధించారు. పిఎఫ్‌ఐ కార్యకర్తలను తీసుకువెళ్లే వాహనాల కోసం పోలీసు మైదానం, బీచ్‌ను తెరవాలని స్థానిక యంత్రాంగం నిర్ణయించింది. పీఎఫ్‌ఐ సభకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను జిల్లా పోలీసు ఉన్నతాధికారులు నేరుగా పర్యవేక్షిస్తున్నారు.
ఇలాంటి పీఎఫ్ఐ ర్యాలీ ఏదైనా భద్రతా వైఫల్యాలకు, హింసకు దారి తీస్తుందని ఇంటెలిజెన్స్ ఏడీజీపీ హెచ్చరించినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదు. రాజకీయ జోక్యాలతోనే ఉగ్రవాదులు ర్యాలీని చేపట్టేందుకు అనుమతించారనే ఆరోపణలు ఉన్నాయి.
అలప్పుజా ప్రాంతం ఇటీవల రెండు రాజకీయ హత్యలతో ఉలిక్కిపడింది. ఇక్కడ బాధితులు ఆర్.ఎస్.ఎస్ కార్యకర్తలు. హంతకులందరూ పీఎఫ్ఐ నుండి శిక్షణ పొందిన వారు.
ఆర్.ఎస్.ఎస్ ముఖ్య శిక్షకుడు నందు, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసన్‌ను చంపిన నిందితులు ఇక్కడ స్వేచ్ఛగా తిరుగుతున్నారు.
శ్రీనివాసన్‌ను నరికి చంపిన ఆయన ఇంటికి అర కిలోమీటరు దూరంలో ర్యాలీ జరుగుతుంది. పోలీసులు అనుమతి నిరాకరించినప్పటికీ, అదే ప్రాంతంలో హతమైన షాన్ అనే ఉగ్రవాదికి సన్మానం చేయడానికి పీఎఫ్ఐ సంస్మరణ సభ జరిగింది. పోలీసులు మూగ ప్రేక్షకులుగా మిగిలిపోయారు. దీంతో ఈ జిల్లాలో పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది.
గత వారం, కేరళ హైకోర్టు పీఎఫ్ఐ, దాని రాజకీయ విభాగం, సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా(ఎస్.డి.పి.ఐ) తీవ్రవాద సంస్థలు అని గమనించి, వాటిని ఎందుకు నిషేధించడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ సంస్థలు క్రూరమైన హింసాత్మక చర్యలకు పాల్పడతాయనడంలో సందేహం లేదని కోర్టు పేర్కొంది. అయినా విజయ్ ప్రభుత్వం వాటిపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు సరికదా, సహకరిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి.
Source: HINDU POST





