
-
భక్తులకు రూ.ఐదు లక్షల ప్రమాద బీమా
-
అత్యున్నత స్థాయి సమావేశంలో అమిత్ షా వెల్లడి
న్యూఢిల్లీ: అమర్‌నాథ్ యాత్రికుల భద్రత కోసం రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ట్యాగ్స్‌ను ఉపయోగించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలో జరిగిన హైలెవెల్ సెక్యూరిటీ రివ్యూలో నిర్ణయించారు. ట్యాగ్స్, రీడర్స్‌ను ఉపయోగించి యాత్రికులను వైర్‌లెస్ విధానంలో నిరంతరం గమనించాలని నిర్ణయించారు.
ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్స్, రీడర్స్‌తో కూడిన వైర్‌లెస్ ట్రాకింగ్ సిస్టమ్‌లో చేతితో పట్టుకెళ్లగలిగిన లేదా స్తంభాలు, భవనాల వంటి స్థిరంగా ఉండేవాటికి అమర్చగలిగిన పరికరాలను దీనిలో ఉపయోగిస్తారు. వీటికి సమీపంలో ఉండే వస్తువులు లేదా వ్యక్తుల సమాచారాన్ని, గుర్తింపును తెలియజేసేందుకు రేడియో తరంగాలను వాడతారు. ఈ ట్యాగ్స్ గోప్యంగా సంకేత భాషలో సమాచారాన్ని తీసుకెళ్తాయి. అదేవిధంగా సీరియల్ నంబర్స్, క్లుప్తమైన వివరణలను తీసుకెళ్తాయి. వైమానిక పరిశ్రమల్లో ఉపయోగించే హై మెమరీ ట్యాగ్స్‌ను కూడా ఉపయోగిస్తారు.
రీడర్‌తో రేడియో తరంగాలను ఉపయోగించి కమ్యూనికేట్ చేయడం కోసం ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్, యాంటెన్నాలను ఈ ట్యాగ్స్ ఉపయోగించుకుంటాయి. లో ఫ్రీక్వెన్సీ, హై ఫ్రీక్వెన్సీ, అల్ట్రా హై ఫ్రీక్వెన్సీ రేడియో తరంగాలను ఉపయోగించుకుంటాయి. ఈ ట్యాగ్స్ తిరిగి పంపించే రేడియో తరంగాలను హోస్ట్ కంప్యూటర్ విశ్లేషిస్తుంది. వస్తువులను, వ్యక్తులను గుర్తించడానికి ఆర్ఎఫ్ఐడీలకు నేరుగా కనిపించనక్కర్లేదు.





