News

జమైకాలో పర్యటిస్తున్న మొదటి భారత రాష్ట్రపతి కోవింద్

564views

కింగ్‌స్టన్: నాలుగు రోజుల పర్యటనకై జమైకా చేరుకున్న భారత రాష్ట్రపతి రామనాథ్ కోవింద్‌కు రాజధాని నగరంలోని కింగ్‌స్టన్ విమానాశ్రయంలో ఆ దేశ అధినేతలతో పాటు ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. జమైకాలో పర్యటిస్తున్న మొట్టమొదటి భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కావడం విశేషం.

ఆయనతో పాటు ఆయన భార్య సవితా కోవింద్, కూతురు స్వాతి కోవింద్, కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి, లోక్‌సభ ఎంపీలు రమా దేవి, సతీష్ కుమార్ గౌతమ్‌లతో పాటు సెక్రెటరీ స్థాయి అధికారులు కొందరు వెళ్ళారు. జమైకా గవర్నర్ జనరల్ పాట్రిక్ అల్లెన్, ప్రధాని ఆండ్రూ హోల్ నెస్, కేబినెట్ సభ్యులు, డిఫెన్స్ స్టాఫ్ చీఫ్, పోలీస్ కమిషనర్ స్వయంగా కింగ్‌స్టన్ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చి కోవింద్‌కు స్వాగతం పలికారు.

జమైకా సైనికులు కోవింద్‌కు గౌరవ వందనం చేశారు. అనంతరం అక్కడి నుంచి ఆయన పెగాసస్‌ హోటల్‌కు చేరుకున్నారు. అక్కడ ప్రవాస భారతీయులు కోవింద్‌కు స్వాగతం పలికారు. నాలుగు రోజుల షెడ్యూల్‌లో భాగంగా నిర్వహించే కార్యక్రమాల్లో కోవింద్ పాల్గొననున్నారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి