
-
రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన ఇస్లాంవాదులు
ఢాకా: బంగ్లాదేశ్‌లోని హిందువులపై అనేక దాడులు జరిగిన తర్వాత కూడా, దేశంలోని ఇస్లాంవాదులు మరింత మతపరమైన హింసను ప్రేరేపించడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నారు.
మైనారిటీలపై హింసను రేకెత్తించడానికి వారు బాగా వాడుతున్న ఆయుధం ఏమిటంటే, హిందూ దేవాలయంలో ఖురాన్ కాపీని ఉంచి హిందువులు దూషించారని ఆరోపించడం. ఇక్కడ కొంతమంది ఇస్లాంవాదులకు ఈ చర్య బాగా అలవడింది. ఏప్రిల్ 2022లో బంగ్లాదేశ్‌లో ఇటువంటి రెండు సంఘటనలు జరిగిన విషయం విదితమే. అయితే, హిందువులు, అటువంటి చర్యల పట్ల అప్రమత్తంగా ఉన్నారు. ఈ నెలలో ఇస్లామిస్టులు జరిపే రెండు దాడులను నివారించగలిగారు.
మొదటి సంఘటన
కొమిల్లా జిల్లాలోని ఈశ్వర్ పాఠశాల ప్రాంతంలో మొదటి సంఘటన జరిగింది. ఏప్రిల్ 17 రాత్రి, ఒక ముస్లిం వ్యక్తి హిందువుగా మారువేషం వేసుకుని, ఆ ప్రాంతంలోని స్థానిక ఆలయాన్ని సందర్శించాడు. చేతిలో ఓ ప్యాకెట్ కూడా పట్టుకున్నాడు. ఆ ప్యాకెట్‌ను గుడి కోనేరులో దొంగచాటుగా పెట్టేందుకు ప్రయత్నించాడు. కానీ, ఆలయంలో ఉన్న భక్తులు అతనిని పట్టుకున్నారు. తర్వాత పోలీసులను పిలిచారు.
పోలీసుల విచారణలో, అతను ఖురాన్ కాపీని ఉంచడానికి ఆలయంలోకి ప్రవేశించినట్టు అంగీకరించాడు. అయితే, భారీ మత హింసకు దారితీసే ఈ హేయమైన చర్యకు ఆ వ్యక్తిని పురామాయించిన తెరవెనుక వ్యక్తుల పేర్లను పోలీసులు వెల్లడించలేదు. ఆలయంలోకి ప్రవేశించిన నిందితుడు ముస్లిం అని ఆలయ కమిటీ పేర్కొంది.
ఈ సంఘటన దేశంలోని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు, ఎలక్ట్రానిక్ మీడియాలో వైరల్ అయింది. నిందితుడు ఖురాన్ కాపీని ఆలయంలో ఉంచి ఉంటే, ఇస్లామిక్ దేశంలోని ఎంతోమంది మైనారిటీలు మత హింసకు బలయ్యేవారని అక్కడి హిందువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రెండో ఘటన కాళీ మందిర్‌లో…
ఇస్లాంవాదులు తదుపరి పటువాఖలి జిల్లాలోని బౌపాల్ ఉపజిల్లాలో ఉన్న కాళీ మందిర్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. ఏప్రిల్ 28వ తేదీ రాత్రి, ఇద్రీష్ ఖాన్ అనే ముస్లిం వ్యక్తి ఖాన్ గంచాలో ఏదో చుట్టి ఆలయంలోకి ప్రవేశించాడు.
రాత్రిపూట ఆలయంలో కాపలాగా ఉన్న హిందువులు ఖాన్ ఆలయంలోకి ప్రవేశించడాన్ని వారు గమనించారు. అతను గుడిలో గంచా చుట్టను ఉంచినప్పుడు అతన్ని పట్టుకున్నారు. పోలీసులకు సమాచారం అందించారు. ఖురాన్ కాపీని ఆలయంలో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నట్టు నిందితుడు అంగీకరించాడు. అతడు ఒప్పుకోవడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Source: HINDU POST