News

మమతకు సాహితీ పురస్కారం… బెంగాలీ రచయిత్రి అవార్డు వాపస్!

426views

కోల్‌క‌తా: పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సాహిత్య పురస్కారం ప్రకటించిన పశ్చిమబంగా బంగ్లా అకాడమీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బెంగాలీ రచయిత, జానపద సాహిత్య పరిశోధకురాలు రత్నా రషీద్‌ బెనర్జీ తన అవార్డుని వెనక్కి ఇచ్చారు.

2019లో ‘అనందా శంకర్‌ శ్రమక్‌ సమ్మాన్‌’ పేరిట రత్నా రషీద్‌కు ఆ అకాడమీ అవార్డుని ప్రకటించింది. ఈ మేరకు ఆమె రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, అకాడమీ చైర్మన్‌ భ్రత్యా బసుకి ఒక లేఖ రాశారు. మమతా బెనర్జీ రాసిన పుస్తకంలో సాహిత్యమే లేదని ఆమె స్పష్టం చేశారు.

సోమవారం రవీందన్రాథ్‌ ఠాగూర్‌ జయంతి సందర్భంగా 900 కవితలతో మమతా బెనర్జీ విడుదల చేసిన ‘కబితా బితాన్‌’ అనే పుస్తకానికి ఈ ఏడాదికి సాహిత్య పురస్కారాన్ని ప్రకటించారు. సాహిత్య అకాడమీ ఈ సంవత్సరం కొత్తగా ప్రవేశపెట్టిన అవార్డును ముఖ్యమంత్రికి అందజేశారు.

ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వెంటనే తన అవార్డుని వెనక్కి ఇవ్వాలని తాను భావించానని ఆ లేఖలో రత్నా రషీద్‌ తెలిపారు. మమతా బెనర్జీకి సాహిత్య అవార్డుని ప్రదానం చేయడాన్ని తాను అవమానకరంగా భావిస్తున్నానని, ఈ పరిణామం విపరీత పరిస్థితులకు దారితీస్తుందని ఆమె పేర్కొన్నారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి