379
చెన్నై: డీఎంకే పాలనలో ఆధ్యాత్మిక వ్యవహారాలలో రాజకీయ జోక్యం అధికమైందని అన్నాడీఎంకే అసమ్మతి నాయకురాలు శశికళ ఆరోపించారు. ఆలయాలలో, మఠాలలో ప్రాచీన సంప్రదాయం ప్రకారం నిర్వహించే వేడుకలపై నిషేధం అమలు చేయడం తగదన్నారు.
దేవాదాయ శాఖ మంత్రి కూడా ఆలయాల్లో అమలులో ఉన్న ప్రాచీన సంప్రదాయాలు, ఆచార వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదని హితవు పలికారు. ఆధ్యాత్మిక వ్యవహారాల్లో రాజకీయ జోక్యం తగదని, అధికార డీఎంకే మఠాధిపతుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం గర్హనీయమని శశికళ దుయ్యబట్టారు.