News

తాజ్ మహల్ స్థలం జైపూర్ రాజవంశానిది

293views
  • రాజస్థాన్ ఎంపీ దివ్య కుమారి ప్రకటన

రాజ‌స్థాన్: ఆగ్రాలో తాజ్‌ మహల్‌ కట్టించిన ప్రాంతం వాస్తవానికి జైపూర్‌ పాలకుడు జై సింగ్‌కు సంబంధించింది. అందుకు తగ్గ ఆధారాలు తమ పూర్వీకుల రికార్డుల్లో ఉన్నాయి అని రాజస్థాన్‌ బీజేపీ ఎంపీ దివ్య కుమారి ఒక ప్రకటన చేశారు. ఆ భూమి తమ కుటుంబానికే చెందిందని, షా జహాన్‌ దానిని స్వాధీనం చేసుకున్నాడని ఆమె అంటున్నారు.

ఆ కాలంలో న్యాయ వ్యవస్థ, అప్పీల్‌ చేసుకునే అవకాశం లేదన్న విషయం అందరికీ తెలుసని… ఒకవేళ తమ దగ్గరున్న రికార్డులను పరిశీలిస్తే.. విషయం ఏంటో స్పష్టంగా తెలిసి వస్తుందని ఆమె అంటున్నారు. అంతేకాదు.. అలహాబాద్‌ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌ను సైతం ఆమె సమర్థించారు. ‘‘తాజ్‌ మహల్‌లో 22 గదులు తెరవాలని పిటిషన్‌ వేశారు. దానికి నేను మ‌ద్ద‌తు ఇస్తా. ఎందుకంటే అది తెరుచుకుంటేనే.. వాస్తవం ఏంటో అందరికీ తెలుస్తుంది.

తాజ్‌ మహల్‌ కంటే ముందు అక్కడ ఏముందో తెలిసే అవకాశం ఉంది. బహుశా అక్కడ గుడి కూడా ఉండొచ్చు. మక్బరా కంటే ముందు అక్కడ ఏముందో తెలుసుకునే హక్కు అందరికీ ఉంది అంటూ ఆమె వ్యాఖ్యానించారు. అయితే, తమ పూర్వీకులకు(జైపూర్‌ పాలకుల) సంబంధించిన రికార్డులను తాను పరిశీలించలేదని, ఆ తర్వాతే వాటిపై ఓ నిర్ధారణకు వచ్చి ఏం చేయాలనే దానిపై ఓ నిర్ణయం తీసుకుంటానని ఆమె అంటున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి