మహారాష్ట్రలో చెలరేగిన లౌడ్ స్పీకర్ ల వివాదంతో ముంబైలోని మసీదులు శబ్ద నియంత్రణ చర్యల్లోకి దిగుతున్నాయి. ఈ విషయాన్ని మరింత జటిలం చేయదల్చుకోలేదని, అందుకే తాము మైకుల శబ్దాన్ని నియంత్రిస్తున్నామని మసీదు నిర్వాహకులు చెబుతున్నారు. ముంబైలోని అతిపెద్ద మసీదు అయిన జుమా మసీదు తో పాటు మరో 900 మసీదులు ఈ చర్యలకు పూనుకున్నాయి. ఈ విషయమై జుమా మసీదు ముఖ్య నిర్వాహకులు మాట్లాడుతూ ‘‘మసీదుల్లో ప్రార్థనలు చేసేప్పుడు వస్తున్న శబ్దం ఇప్పటికే చాలా రాజకీయం అయింది. అయితే ఇది మత కోణం తీసుకోక ముందే మైకుల శబ్దాన్ని నియంత్రించాలని మేము నిర్ణయించుకున్నాం’’ అని సమాధానం ఇచ్చారు. లౌడ్ స్పీకర్లను తొలగించడం తప్ప వేరే దారి లేదని మసీదుల నిర్వాహకులు చెబుతున్నారు.
మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ థాకరే దీన్ని మత కోణంలో కాకుండా సామాజిక కోణంలో చూడాలని అంటున్నారు. అలాగే మతం అనేది వ్యక్తిగతమైనప్పుడు లౌడ్ స్పీకర్లు పెట్టి 365 రోజులు ప్రార్థన చేయాల్సిన అవసరం ఏంటని ఆయన ప్రశ్నిస్తున్నారు. 288 స్థానాలున్న థాకరే పార్టీ మసీదుల నుంచి లౌడ్ స్పీకర్లను తొలగించేలా చట్టం చేయాలని డిమాండ్ చేస్తోంది.