NewsProgramms

అడవి బిడ్డల ముంగిటికి ప్రసూతి వైద్య నిపుణుల సేవలు

330views

ననాల రేటు నానాటికి తగ్గిపోయి భారత ప్రభుత్వ జనాభా లెక్కల మేరకు అంతరిస్తున్న జాతుల జాబితాలో (PTG Chenchu) చేర్చబడిన చెంచుల జీవితాల్లో ఆరోగ్య జ్యోతులు వెలిగించడానికి సంఘమిత్ర, నంద్యాల అలుపెరుగని పోరాటం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే‌.

స్త్రీ సంబందమైన సమస్యల విషయాల్లో ఈ గూడేల మహిళలు చాలా సమస్యలు ఎదుర్కొం టున్నారు. స్త్రీ సహజమైన సున్నితత్వం, బిడియం,ఈ తెగల్లో మహిళల పట్ల ఉన్న నిర్లక్ష్యం, మహిళా వైద్యులు అందుబాటులో లేక పోవడం, రవాణా సదుపాయాలు, ఆర్థిక వెసలుబాటు, అవగాహన అంతంత మాత్రం ఉన్న కారణంగా వారి బాధలు ఎవరితో పంచుకోవాలో తెలియక ఆ వ్యాధులు తీవ్రతరమై, వందేళ్ళ జీవితాలు అర్దాంతరంగా తెల్లారి పోయిన సందర్భాలెన్నో.

ఈ తెగల్లో జననాలరేటు తగ్గి పోవడానికి కూడా ఇదే ప్రధాన కారణం. ఈ సమయంలో నంద్యాల ఐ యమ్ ఏ మహిళా వైద్యవిభాగానికి చెందిన ఎనిమిది మంది ప్రముఖ ప్రసూతి వైద్యనిపుణులు డా.నర్మద, డా. మాధవి, డా.వసుధ, డా.హరిత, డా.సునీత, డా.శశికిరణ్, డా.అరుణ కుమారి, డా.హర్షిత గార్లు నల్లమల అడవులలోని పెద్దగుమ్మడాపురం, ఎర్రమటం చెంచు గూడేలకు వెళ్లి మహిళలకు పోషకాహారం, వ్యక్తిగత పరిశుభ్రత, గర్భధారణ సమస్యలు, ఆ సందర్బంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించడంతో పాటు వారిని పరీక్షించి, అవసరమైన మందులు, టానిక్కులు ఉచితంగా పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో సంఘమిత్ర అధ్యక్షులు శ్రీ నాగ సుబ్బారెడ్డి, కార్యదర్శి శ్రీ చిలుకూరి శ్రీనివాస్, శ్రీ వాసుదేవ రెడ్డి, సంఘమిత్ర మరియు గోకవరం ఆవాస ప్రముఖులు గంగాధర్, రామకృష్ణ తదితరులు కార్యక్రమాన్ని ఆద్యంతం సమన్వయం పరుస్తూ, ఈ సేవా యజ్ఞానికి దిగ్విజయంగా అంకురార్పణ చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.