News

శ్రీలంక ప్రధాని రాజీనామా

487views

శ్రీలంక ప్రధాని మహింద్ర రాజపక్సే తన పదవికి రాజీనామా చేశారు. శ్రీలంకలో ఆర్థిక పరిస్థితి దిగజారడం, ధరలు ఆకాశాన్ని తాకటంతో ఆయన ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కుంటున్నారు. రాజపక్సే రాజీనామా చెయ్యాలంటూ అన్ని వర్గాల నుంచి డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. విపక్షాలు ఆయన గద్దె దిగి, తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని పెద్ద ఎత్తున డిమాండు చేస్తున్నాయి. దాంతో ఎట్టకేలకు ఆయన నేడు రాజీనామా చేశారు. ఇక ప్రస్తుతం మహింద్ర సోదరుడు, శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సే కూడా రాజీనామా చేయాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయ్.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.