News

బెర్లిన్‌లో మోడీకి ప్రవాస భారతీయుల ఘ‌న స్వాగ‌తం

617views

న్యూఢిల్లీ: మూడు రోజుల విదేశీ పర్యటనల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ జర్మనీలో పర్యటిస్తున్నారు. ఇవాళ ఉదయం న్యూఢిల్లీ నుంచి జర్మనీకి బయల్దేరారు. బెర్లిన్ చేరుకున్న మోడీకి ప్రవాస భారతీయుల నుంచి ఘన స్వాగతం లభించింది. బెర్లిన్‌లో జర్మనీ ఛాన్స్ లర్ ఒలాఫ్ స్కోల్జ్ తో కలిసి 6వ ఇండియా జర్మనీ ఇంటర్ గవర్నమెంటల్ కన్సల్టేషన్స్ లో పాల్గొననున్నారు. రేపు ఉన్నతస్థాయి చర్చలు జరిపేందుకు డెన్మార్క్ వెళ్ళ‌నున్నారు.

మూడు రోజుల్లో 25 కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొంటారని, ఏడు దేశాలకు చెందిన ఎనిమిది మంది ప్రపంచ స్థాయి నేతలతో చర్చలు జరుపుతారు. 50 గ్లోబల్ బిజినెస్ లీడర్లతో ఇంటరాక్ట్ కానున్నారు. వేలాది మంది ప్రవాస భారతీయులతోనూ మోడీ మాట్లాడనున్నారు.

Source: V6 Velugu

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి