News

జర్మనీ, డెన్మార్క్, ఫ్రాన్స్ లలో పర్యటించనున్న ప్రధాని మోడీ

458views

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మే నెలలో మూడు దేశాల పర్యటనకు వెళ్లనున్నారు. మే 2 నుంచి 4వ తేదీ వరకూ ప్రధాని విదేశాల్లో పర్యటిస్తారని విదేశాంగశాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ పర్యటన సందర్భంగా ఆయన.. జర్మనీ, డెన్మార్క్‌, ఫ్రాన్స్ లలో పర్యటించనున్నారు. బెర్లిన్ ‌లో ప్రధాని మోడీ జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్ తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు.

అంతే కాకుండా వారిద్దరూ భారతదేశం- జర్మనీ ఇంటర్ – గవర్నమెంటల్ కన్సల్టేషన్స్ (ఐజీసీ) ఆరవ ఎడిషన్ ‌కు సహ-అధ్యక్షులుగా ఉంటారు. ఇది ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్ తో ప్రధాని మొదటి సమావేశం. కాగా ఈ ఏడాది ప్రధాని మోడీకి ఇదే తొలి విదేశీ టూర్‌. చివరగా గతేడాది నవంబర్‌లో గ్లాస్గోలో జరిగిన కాప్ సదస్సుకు ఆయన హాజరయ్యారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.