News

ఎన్ ‌సీ ఎస్ ‌సీ ఛైర్ ‌పర్సన్ ‌గా విజయ్‌ సాంప్లా

498views

భాజపా నేత, కేంద్ర మాజీ మంత్రి విజయ్‌ సాంప్లా షెడ్యూల్డ్‌ కులాల జాతీయ కమిషన్‌ (ఎన్ ‌సీ ఎస్ ‌సీ) ఛైర్ ‌పర్సన్ ‌గా రెండోసారి నియమితులయ్యారు.

ఈమేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ బుధవారం నియామక ఉత్తర్వులను జారీ చేశారు. గతంలో ఇదే పదవిలో ఉన్న సాంప్లా ఈ ఏడాది జరిగిన పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజీనామా చేశారు. అనంతరం ఆ ఎన్నికల్లో పోటీచేశారు. 2014లో పంజాబ్ ‌లోని హోశియార్ ‌పుర్‌ లోక్ ‌సభ స్థానం నుంచి ఎన్నికైన ఆయన అనంతరం కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.