NewsProgramms

మన తీరప్రాంతాన్ని మనమే సంరక్షించుకుందాం రండి – మత్స్యకార సంక్షేమ సమితి పిలుపు

849views

రతరాలుగా సముద్రంలో వేటే జీవనాధారంగా బ్రతుకుతున్న మనం, మన సముద్ర తీర ప్రాంతాలను మనమే శుభ్రం చేసుకుందామని జూన్ 5 2022 న వచ్చే ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ మత్స్యకార సంక్షేమ సమితి రాష్ట్రంలోని మత్స్యకారులకు పిలుపునిచ్చింది. ఆ మేరకు మత్స్యకార సోదరులకు మత్స్యకార సంక్షేమ సమితి చేసిన విన్నపాన్ని యదాతథంగా చూద్దాం.

మత్స్యకార సంక్షేమ సమితి

ఆంధ్రప్రదేశ్

తరతరాలుగా మనం సమద్రము సముద్ర తీరం పై ఆధారపడి, (వృత్తుల్లోకల్లా అత్యంత ప్రమాదకరమైన వృత్తి) చేపల వేట మీదే జీవనం సాగిస్తూ అభివృద్ధికి నోచుకోని జీవితాలు మనవి. నిత్యం గంగమ్మ తల్లినే నమ్ముకుని గడుపుతున్న జీవితాలు మనవి.

అలాంటి గంగమ్మ తల్లిఒడిలో…
మన జీవన విధానానికి మరియు జల జీవరాశులకు హానికలిగించే భౌతిక, రసాయనిక, జీవ రసాయన సంబంధమైన పదార్థాలు ఉదా : చమురుశుద్ధి కర్మాగారాలు , పట్టణాల్లో వ్యర్థ పదార్థాలు, ఫెర్టిలైజర్స్, ఫెస్టిసైడ్స్, ఫార్మా హబ్స్ వ్యర్థాలు, ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ కవర్లు, ఇంకా ఇతరత్రా విష పదార్థాలు నదులుద్వారా, కాలువలుద్వారా, బ్యాక్ వాటర్ కెనాల్స్ ద్వారా అధిక మొత్తంలో సముద్రంలో కలిపి సముద్రాన్ని సైతం కలుషితం చేస్తున్నారు.

మన సముద్రాలను మరియు తీరాలను రక్షించుకోవలసిన బాధ్యత మనదే. ఈరోజు మనం మేల్కొనకపోతే రాబోయే తరాలకు మనుగడ కష్టమౌతుంది.

కాబట్టి 05 -06-2022తేదీ ఆదివారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మనదేశంలో ఉన్న 9 తీరప్రాంత రాష్ట్రాల్లో మరియు 4 కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం తీరప్రాంతం : 7516.6 కి.మీ పరిధిలో ఉన్న మన ఆంధ్రప్రదేశ్ తీరం 974 కి.మీ ఫరిధిలో మన 77 మత్స్యకార మండలాలలో 856 గ్రామాల్లో ప్రతి గ్రామ తీరంలో మన బీచ్లలో ఉన్న చెత్త, చెదారం, ప్లాస్టిక్, వగైరాలన్నిటినీ శుభ్రం చేసుకుందామని ఆలోచన చేస్తున్నాము.

ఈ కార్యక్రమం పై మీ విలువైన సలహాలు, సూచనలు అందించాలని మన గ్రామాల్లో బీచ్ లను మనమే శుభ్రం చేసుకునేందుకు మనవారి కోసం మనంగా ముందుకు రావాలని కోరుతున్నాము.

మీ విలువైన స్పందన, సలహాలు, సూచనలు ఇస్తారని ఆశిస్తూ….

కె.పోలయ్య
రాష్ట్ర అధ్యక్షులు.
మత్స్యకార సంక్షేమ సమితి, ఆంధ్రప్రదేశ్

పి.వాసు.
ప్రధానకార్యదర్శి
మత్స్యకార సంక్షేమ సమితి, ఆంధ్రప్రదేశ్.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.