News

‘రూ. రెండు కోట్లకు ప‌ద్మ‌భూష‌ణ్‌: యూపీఏ ఎర‌’

467views
  • ఆ డబ్బుతోనే సోనియాకు వైద్యం…. సంచలన విషయాలను వెల్లడించిన ఎస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు

న్యూఢిల్లీ: కాంగ్రెస్​ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా నుంచి ఎంఎఫ్​ హుస్సేన్ పెయింటింగ్​ను రూ.2కోట్లకు కొనుగోలు చేయాలని తనపై ఒత్తిడి చేసినట్టు ఎస్ బ్యాంక్​ వ్యవస్థాపకుడు రాణా కపూర్​ తెలిపారు. నాటి యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఉన్న మురళీ దేవరా బలవంతం చేసినట్టు ఎన్​ఫోర్స్​మెంట్​ డెరక్టరెట్​(ఈడీ)కి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. బదులుగా తనకు పద్మభూషణ్​ పురస్కారం లభిస్తుందనే హామీ ఇచ్చినట్టు వెల్లడించారు. ఈ వివరాలను ముంబయిలోని ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన ఛార్జ్​షీట్​లో ఈడీ ప్రస్తావించింది.

ఈ నిధులతో సోనియాకు చికిత్స!

చెక్కు ద్వారా తాను అందించిన రూ.2 కోట్లను న్యూయార్క్​లో సోనియా గాంధీ చికిత్స కోసం వినియోగించినట్టు రాణా కపూర్ తెలిపారు. అయితే, తనకు ఇచ్చిన హామీ మాత్రం నెరవేరలేదని అన్నారు. “సోనియా చికిత్సకు సహకరించడం ద్వారా ఆ కుటుంబానికి చాలా మంచి పని చేశానని ఆమె సన్నిహితుడు అహ్మద్​ పటేల్ నాతో అన్నారు. నాకు పద్మభూషణ్ అందడంలో ఇది తోడ్పడుతందని చెప్పారు. అయితే, ఈ కొనుగోలు బలవంతంగా జరిగింది, అందుకు నేను సిద్ధంగా లేను” అని రాణా పేర్కొన్నారు.

రాణా కపూర్​, ఆయన కుటుంబంపై నమోదైన మనీలాండరింగ్​ కేసును ఈడీ దర్యాప్తు చేస్తోంది. గౌతమ్​ థాపర్​కు చెందిన అవంతా కంపెనీకి ఎస్​ బ్యాంక్​ నుంచి అక్రమంగా రూ.1900 కోట్ల రుణాన్ని అందిచడంపైనా కేసు నమోదైంది. అందుకోసం రాణాకు రూ.300 కోట్ల లంచం ముట్టిందని ఈడీ ఆరోపించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి