
606views
తిరువనంతపురం: ద్విచక్ర వాహనంపై వెనుక సీటులో (పిలియన్ రైడర్) పురుషులు కూర్చోవడంపై నిషేధం విధించారు కేరళలోని పాలక్కడ్ అదనపు కలెక్టర్. ఆర్ఎస్ఎస్ కార్యకర్తను ఎస్డీపీఐ కార్యకర్త హత్య చేసిన కేసులో ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
ఆర్ఎస్ఎస్ కార్యకర్త శ్రీనివాసన్ షాప్‌కు టూవీలర్‌పై ఇద్దరు వ్యక్తులు వచ్చి.. పట్టపగలే అతడిని హత్య చేశారు. 24 గంటల వ్యవధిలో జంట హత్యలు జరగడం వల్ల ఈ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
వరుస హత్యల నేపథ్యంలో పాలక్కడ్ యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ క్రమంలో మరిన్ని హత్యలు జరిగే ప్రమాదం ఉందని భావించిన ఎడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్.. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. అయితే, నిషేధం నుంచి మహిళలు, చిన్నారులకు మినహాయింపును ఇచ్చారు. కొద్ది రోజుల కిందట పెట్టిన ఈ ఆంక్షలు రేపటి నుంచి తొలగనున్నాయి.





