News

పాకిస్థాన్‌కు వార్నింగ్ ఇచ్చిన తాలిబాన్లు

540views

కాబూల్‌: పాకిస్థాన్ ఈ నెల 16న ఆఫ్ఘనిస్థాన్‌లోని ఖోస్త్, కునార్ ప్రావిన్స్ ల్లో వైమానిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో 40 మందికి పైగా పౌరులు మరణించారని ఆఫ్ఘన్ వర్గాలు చెబుతున్నాయి. వారిలో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు.

దీనిపై తాలిబాన్ పాలకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులోనూ పాక్ ఇదే తీరులో దాడులకు తెగబడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తాలిబన్ ప్రభుత్వ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ హెచ్చరించారు. ఇందుకు ఆఫ్ఘనిస్థాన్‌లో పాక్ రాయబారికి సమన్లు జారీ చేశారు. ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్థాన్‌ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తోందని ముజాహిద్ తెలిపారు. పదేపదే తప్పిదాలకు పాల్పడుతూ ఆఫ్ఘన్ల సహనాన్ని పరీక్షించవద్దని స్పష్టం చేశారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి