News

జమ్మూలో హిందూ దేవాల‌యం ధ్వంసం

621views

జమ్మూ: జమ్మూలోని ఓ హిందూ ఆలయాన్ని కొందరు గుర్తుతెలియని దుండగలు ధ్వంసం చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలిస్తున్నట్టు అధికారులు తెలిపారు. సిటీ శివార్లలోని సిధ్రలో ఈ ఘటన చోటుచేసుకుంది.

దశాబ్దాల క్రితం నాటి ఈ ఆలయంలోని విగ్రహాలను దుండగలు ధ్వంసం చేసినట్టు అధికారులు చెప్పారు. ఆలయ పూజారాలు ఉదయం ఆలయానికి చేరుకోగానే విగ్రహాల విధ్వంసం జరిగినట్టు గుర్తించారని, వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రజలు మతసామరస్యాన్ని పాటించాలని, శాంతికి భంగం కలిగించేందుకు ప్రయత్నించే విద్రోహ శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.