
472views
న్యూఢిల్లీ: పాకిస్థాన్.. తన వికృత చేష్టలను మానునకోవడం లేదు. మరోసారి సరిహద్దుల నుంచి భారత భూభాగంలోకి డ్రోన్లను పంపిన ఘటన వెలుగులోకి వచ్చింది. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాలోని బోర్డర్ అవుట్ పోస్ట్ రోసా వద్ద భారత్-పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి అర్థరాత్రి డ్రోన్‌ల కదలిక కనిపించింది. భద్రతా దళాల అప్రమత్తతతో తోక ముడిచింది. అయితే, గత నెలలో కూడా పఠాన్‌కోట్‌లోని అంతర్జాతీయ సరిహద్దులో డ్రోన్ కనిపించింది, దానిని బీఎస్ఎఫ్ తరిమికొట్టింది.





