
రాజస్తాన్: రాజస్తాన్‌లో 17 ఏళ్ళ హిందూ బాలికపై సామూహిక అత్యాచారం, హత్య చోటుచేసుకుంది. ఇందుకు కారకులైన అర్షద్ ఖాన్, అతని ముగ్గురు సహచరులను పోలీసులు అరెస్టు చేశారు.
24 ఏళ్ళ ఖాన్‌కు క్రిమినల్ నేపథ్యం ఉంది. బహిరంగంగా డ్రగ్స్ తీసుకుంటాడు. రివాల్వర్‌తో తిరుగుతుంటాడు. ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ జిల్లాకు చెందినవాడు. అతను ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ బాలికతో పరిచయం పెంచుకున్నాడు. అప్పటినుంచి తన వలలో వేసుకోవడం మొదలుపెట్టాడు. తన మాట విననప్పుడు ఆత్మహత్య చేసుకుంటానని ఆ బాలికను బెదిరించడం ఖాన్‌కు అలవాటు. తనను పెళ్ళిచేసుకోవాలని డిమాండ్ చేశాడు. దీనికి ఆ బాలిక తిరస్కరించింది. అప్పటి నుంచి పగ పెంచుకున్నాడు. మార్చి 22న మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గంటల మధ్య ఖాన్ బాలికను కలిశాడు. పెళ్ళి ప్రస్తావన రావడంతో ఆమె మళ్లీ నిరాకరించింది.
నిందితుడు తన ముగ్గురు సహచరులతో కలిసి ఆ బాలికపై సామూహిక అత్యాచారం చేసి, ఆపై ఆమె గొంతు కోసి చంపాడు. బాధితురాలు పాలి జిల్లాలోని రాస్ గ్రామ నివాసి. చిన్న పిల్లలకు ట్యూషన్ చెప్పేది. ఆ రోజు బాలిక ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతికారు. ఆమె మృతదేహం ఆమె ఇంటికి 20 కిలోమీటర్ల దూరంలో, అజ్మీర్ జిల్లా, ధువారియా గ్రామానికి సమీపంలో, హైవేకి 100 మీటర్ల దూరంలో ఉన్న అడవిలో కనుగొన్నారు.
Source: HINDU POST





