
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నేడు, రేపు రెండు రోజులపాటు దేశవ్యాప్త సమ్మె నిర్వహిస్తున్నట్టు కేంద్ర కార్మిక సంఘాల ఉమ్మడి ఫోరం ప్రకటించింది. సమ్మెకు దిగుతున్నట్టు బొగ్గు, ఉక్కు, చమురు, టెలికం, తపాలా, ఆదాయపన్ను, కాపర్, బ్యాంకులు, బీమా తదితర రంగాల కార్మికులు ఇప్పటికే ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చినట్టు పేర్కొంది.
రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ చర్య: బీఎంఎస్
ఇది రాజకీయ ప్రేరేపితమని, ఇందులో పాల్గొనడం లేదని కార్మిక సంఘం భారతీయ మజ్దూర్ సంఘ్ పేర్కొంది. “2022 మార్చి 28, 29 తేదీల్లో కొన్ని కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన రెండు రోజుల సమ్మెలో బీఎంఎస్ పాల్గొనదు. కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు, భారతీయ మజ్దూర్ సంఘ్ ఇందులో పాల్గొనకూడదని నిర్ణయించుకుంది” అని బీఎంఎస్ తెలిపింది.
ఈ యూనియన్లు అనుబంధంగా ఉన్న రాజకీయ పార్టీల మనుగడ కోసం సమ్మెకు పిలుపునిచ్చాయని.. ఇది రాజకీయంగా ప్రేరేపించబడింది, కార్మికుల ప్రయోజనాలతో ఎటువంటి సంబంధం లేదు. ఈ సమ్మెలలో రైతులు, విద్యార్థి సంఘాలు నిమగ్నమవ్వడం వల్ల ఈ సంఘాలు కార్మికుల ప్రయోజనాలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని, తమ రాజకీయ పార్టీల రాజకీయ ప్రయోజనాల కోసం కార్మికులను మాత్రమే ఉపయోగించుకుంటాయని స్పష్టం చేసింది. “కొన్ని రాజకీయ పార్టీల రాజకీయ ప్రయోజనాల కోసం శ్రామికవర్గాన్ని దోపిడీ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము” అని భారతీయ మజ్దూర్ సంఘ్ ప్రకటనలో పేర్కొంది.
Source: NationalistHub





