లక్నో: ఉత్తరప్రదేశ్‌లో నివసిస్తున్న ఒక ముస్లిం మహిళ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కి ఓటు వేసింది. ఆ సంగతి తన కుటుంబానికి చెప్పడంతో తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారని పేర్కొంది. ఉజ్మాగా గుర్తించిన ఆ మహిళ.. ఆగ్రహంతో అత్తమామలు తనను కొట్టారని, ఇంటి నుండి గెంటేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పోలీసులకు ఫిర్యాదు చేస్తే చంపేస్తానని అత్తమామలు తనను బెదిరించారని ఆమె తెలిపింది. ఉజ్మాను ఎజాజ్ నగర్ గౌటియా నివాసి తాహిర్ అన్సారీ కుమార్తెగా గుర్తించారు. జనవరి 2021లో తస్లీమ్ అన్సారీతో ఆమె వివాహం జరిగింది. అదే ప్రాంతానికి చెందిన ఈ జంట ప్రేమ వివాహం చేసుకున్నట్టు సమాచారం.
కాగా, తంజీమ్ ఉలామా-ఎ-ఇస్లాం జాతీయ ప్రధాన కార్యదర్శి మౌలానా షహబుద్దీన్ రజ్వీ మీడియాతో మాట్లాడుతూ ఓటు వేయడం రాజ్యాంగ హక్కు అని, ఒక వ్యక్తి తనకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేయవచ్చని స్పష్టం చేశారు. బీజేపీకి ఓటు వేసినందుకు విడాకులు తీసుకుంటామని మహిళ అత్తమామలు లేదా భర్త బెదిరిస్తే, ఇస్లామిక్ చట్టాల దృష్టిలో కూడా వారు దోషులేనని ఆయన హెచ్చరించారు.
Source: Nijamtoday