News

ఈ నెల 30 నుంచి శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు

580views

శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానములో మార్చి 30 నుంచి ఏప్రిల్ 3 వరకు ఉగాది మహోత్సవాలు జరగనున్నాయని ఆ ఆలయ అధికారులు ప్రకటించారు. ప్రతి ఏటా కనులపండువగా జరిగే ఈ ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్రల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు నల్లమల మీదుగా పాదయాత్రగా వచ్చి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ. వారికి దారి మధ్యలో మంచినీరు, ఆహారం, వైద్య సదుపాయాల ఏర్పాట్లపై కూడా వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ఆలయ అధికారులు సమన్వయ సమావేశం నిర్వహించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.