News

జమ్మూకశ్మీర్‌లో సర్పంచ్‌ను కాల్చి చంపిన తీవ్రవాదులు

598views

జమ్ము కశ్మీర్​: జమ్ము కశ్మీర్​లో శ్రీనగర్ శివారులో ఓ సర్పంచ్​ను తీవ్రవాదులు కాల్చి చంపారు. నిషేధిత లష్కరే తొయిబా అనుబంధ సంస్థ అయిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్) ముష్కరులు ఈ ఘటనకు బాధ్యత ప్రకటించుకున్నారు. మరణించిన సర్పంచ్​ను సమీర్ భట్​గా గుర్తించారు. భట్​కు పోలీసులు ముందు నుంచీ భద్రత కల్పిస్తున్నారు. శ్రీనగర్​లోని ఓ హోటల్​లో బస చేస్తున్న ఆయన బుధవారం ఎవరికీ తెలియకుండా బయటకు వెళ్లారు. ఇదే సమయంలో ఉగ్రవాదులు నగర శివారులోని ఖాన్మోహ్ ప్రాంతంలో దాడి చేశారు. గాయపడ్డ సర్పంచ్​ను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు. ఘటనాస్థలిని పరిశీలించిన తర్వాత.. నిందితుల కోసం గాలింపు ప్రారంభించినట్టు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు సాగిస్తున్నట్టు చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి