
కైవ్: ఉక్రెయిన్‌పై రష్యా మిలిటరీ జరిపిన దాడిలో నష్టపోయిన వారికి సహాయం చేయడానికి భారతదేశం తీసుకున్న మానవతావాద చర్యలను పిన్న వయస్కుడైన ఉక్రెయిన్ పార్లమెంటు సభ్యుడు స్వియాటోస్లావ్ యురాష్ ప్రశంసించారు. అలాగే ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో మాట్లాడినందుకు ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు.
“ఈ శతాబ్దపు విధిని నిర్ణయించే దేశాలలో భారతదేశం ఒకటి. రష్యా విషయంలో భారత వైఖరి మెచ్చుకోదగ్గదని, ప్రధాని మోదీ మా అధ్యక్షుడికి చేసిన పిలుపునకు ధన్యవాదాలు. భారతదేశం చేసిన మానవతావాద చర్యలకు మేము కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాము” అని ఎ.ఎన్.ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎంపీ అన్నారు.
“భారత్-రష్యా విషయానికి వస్తే, మీకు వ్యూహాత్మక స్నేహం, భాగస్వామ్యంపై ఒప్పందం ఉంది, కేవలం ఉక్రెయిన్ మాత్రమే కాకుండా, గత 20 సంవత్సరాలుగా పుతిన్ పాలన చేస్తున్న అన్ని దుశ్చర్యల దృష్ట్యా దీనిని పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను” అని అన్నారాయన.
ఉక్రెయిన్‌లో శాంతి త్వరలో తిరిగి వస్తుందని ఎంపీ చూస్తున్నారా అనే ప్రశ్నకు సమాధానమిస్తూ, “క్రెమ్లిన్‌పై ఆధారపడి ఉంటుంది. క్రెమ్లిన్ ఒత్తిడిని కొనసాగించాలని నిర్ణయించుకుంటే, మేము పోరాటం కొనసాగిస్తాం. మా పూర్వీకులు కాపాడినట్టుగా మేము రక్షించాలనుకుంటున్న ప్రాథమిక హక్కుల కోసం పోరాడుతాము. మేం గెలిచిన వాటన్నింటిని వదులుకోను”అని అన్నారాయన.
అంతకుముందు, ఉక్రెయిన్ ఎంపీ కూడా పోస్ట్‌కు కాపలాగా, తుపాకీ పట్టుకుని కనిపించారు. ఆ చిత్రంపై ఎంపీ వ్యాఖ్యానిస్తూ, “రష్యా దండయాత్ర నుండి రక్షించడానికి ప్రయత్నించడం అవసరం, ప్రతి ఒక్కరూ ఇప్పుడు సైనికులే. ప్రతి ఒక్కరూ వారి స్థానాన్ని గుర్తుంచుకోవాలి.” అని పేర్కొన్నారు.
Source: Organiser





