
454views
విజయవాడ: కృష్ణా జిల్లా పెనమలూరు మండలం తాడిగడపలోని శ్రీలక్ష్మీ వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో పుష్పయాగం ఘనంగా జరిగింది. 18 రకాల పుష్పాలు, 108 పూల బుట్టలతో తిరుమల శ్రీనివాసుని సన్నిధిలో నిర్వహించినట్టుగానే ఈ పుష్పయాగం వైభవంగా జరిపించారు. తాడిగడప కూడలి నుంచి పుష్పాల బుట్టలతో గ్రామోత్సవం నిర్వహించారు. కోలాటాల ప్రదర్శన నడుమ స్వామి వారి పుష్పాలను ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చారు. పుష్పాల అభిమంత్రణ అనంతరం యాగం కన్నుల పండువగా జరిపారు.
Source: EtvBharat





