
మైసూరు: దసరా ఉత్సవాలకు ప్రసిద్ధి చెందిన మైసూరు ప్యాలెస్ దరి అంబా విలాస్ ప్యాలెస్‌లో కొంతమంది పురుషులు నమాజ్ చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. ఈ ఘటన అనేక ప్రశ్నలకు తావిస్తోంది. సోమవారం ప్యాలెస్‌ను సందర్శించిన గుజరాత్‌కు చెందిన పర్యాటకులలోని కొందరు పురుషులు బహిరంగంగా నమాజ్ చేశారు.
నమాజ్ చేయడానికి ముందు పది మంది పురుషులు ప్యాలెస్ ఆవరణలో చేతులు, కాళ్ళు కడుక్కోవడం వీడియోలో కనిపిస్తుంది. మైసూరు ప్యాలెస్ డిప్యూటీ డైరెక్టర్‌ను సంప్రదించినప్పుడు ఈ అంశంపై వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. కర్ణాటకలోని ఉడిపిలో హిజాబ్ వివాదం ప్రారంభమైన సమయంలో ఈ వివాదాస్పద వీడియో ట్రోల్ అయింది.
దసరా ఉత్సవాలకు ప్రసిద్ధి చెందిన మైసూరు ప్యాలెస్ వడయార్ మహారాజుల నివాసంగా ఉంది. 1897లో ప్యాలెస్ కాలిపోయింది.. దానిని 1912లో పునర్నిర్మించారు. ఈ ప్యాలెస్ కాంప్లెక్స్‌లో 12 హిందూ దేవాలయాలు ఉన్నాయి.
ఇందులో పురాతనమైనది పద్నాలుగో శతాబ్దానికి చెందినది కాగా.. కొత్త దేవాలయం 1953లో నిర్మించబడింది. మైసూర్‌లో దసరా సందర్భంగా పది రోజుల పాటు సాగే ఉత్సవానికి ప్రపంచం నలుమూలల పర్యాటకులు వస్తుంటారు. అంగరంగ వైభవంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తూ ఉంటారు. ఈ చర్య ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే ప్రయత్నమా అని చెప్పడం కష్టంగా ఉన్నప్పటికీ, ప్యాలెస్ గార్డులు తగినంత అప్రమత్తంగా లేరని స్పష్టమవుతోంది.
Source: NationalistHub





