
-
నిందితులపై ఇప్పటికే పలు క్రిమినల్ కేసులు
-
ఒక్క ఖాసిఫ్‌పైనే పది కేసులు
శివమొగ్గ: భజరంగ్ దళ్ కార్యకర్త హర్ష హత్య కేసులో కర్ణాటక పోలీసులు ఇప్పటివరకు మొత్తం ఆరుగురిని అరెస్టు చేశారు. ఈ మేరకు శివమొగ్గ ఎస్పీ లక్ష్మీ ప్రసాద్ మంగళవారం తెలిపారు. ఈ ఆరుగురిపైన ఇప్పటికే క్రిమినల్ రికార్డులు ఉన్నాయి.
మరో 12 మందిని కూడా అదుపులోకి తీసుకున్నామని, హర్ష హత్య వెనుక గల కారణాలను తెలుసుకునేందుకు ప్రతి నిందితుడిని విడివిడిగా విచారిస్తామని ఎస్పీ లక్ష్మీప్రసాద్ తెలిపారు.

అరెస్టు చేసిన నిందితులను ఖాసిఫ్ (కాసిఫ్), సయ్యద్ నదీమ్, ముజాహిద్, రిహాన్ అలియాస్ ఖాసీ, అఫాన్, ఆసిఫ్‌లుగా గుర్తించినట్టు మీడియా నివేదికలు వెల్లడించాయి. నిందితుడు ఖాసిఫ్‌పై పది క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.
ప్రధాన కుట్రదారులు సయ్యద్ నదీమ్, ఖాసిఫ్, మరొకరిని ఫిబ్రవరి 21న బెంగళూరులో పట్టుకున్నారు. మిగిలిన ముగ్గురిని మంగళవారం పట్టుకున్నారు. విలేఖరుల సమావేశంలో ఎస్పీ లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ, ఆదివారం రాత్రి క్యాంటీన్‌లో టీ తాగుతున్న హర్షను కారులో వచ్చిన నిందితులు వెంబడించి, హత్య చేశారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారన్నారు.
Source: Opindia





