
నంద్యాల: అడవి బిడ్డల పాలిట ఆరాధ్య దైవం సంత్ సేవా లాల్ జయంతి వేడుకలు నంద్యాల, పాణ్యం మండలాల్లో ఘనంగా జరిగాయి. 15వ తేదీన నంద్యాల మండలం అబాండం తండాలో సేవాలాల్ మహరాజ్ 283వ జయంతి, బోగ్ బండారో పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కర్నూలు విభాగ్ ధర్మ జాగరణ ప్రముక్ రాంప్రసాద్, బంజారా ధర్మ రక్ష సమితి ప్రాంత సంయోజక్ హాథిరామ్ నాయక్, బి.డి.ఆర్.ఎస్. నంద్యాల జిల్లా అధ్యక్షులు చందు నాయక్, బి.డి.ఆర్.ఎస్. నంద్యాల
జిల్లా సహా సంయోజక్ చంద్ర నాయక్, విజయ్ నాయక్, కార్తీక్ నాయక్ తండా ప్రజలు పాల్గొన్నారు.


అలాగే, పాణ్యం మండలం సుగాలి మెట్ట గ్రామంలో జరిగిన కార్యక్రమంలో సుగాలి మెట్ట సర్పంచ్, ఉప సర్పంచ్, గుడి పూజారి సోమశేఖర్ నాయక్, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో సేవాలాల్ మహారాజ్ భోగ్ కార్యక్రమం జరిగింది. అలాగే దండి మారెమ్మ అమ్మవారి పూజ కార్యక్రమంలో స్థానిక ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.





