
401views
తిరుపతి: శ్రీవారి భక్తులకు ఎట్టకేలకు శుభవార్త. ఈ నెల 15 నుంచి ఆఫ్ లైన్‌లో సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్నట్టు టీటీడీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. కొవిడ్ మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఆఫ్ లైన్ టికెట్ల జారీ ప్రక్రియను నిలిపివేసిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం రాష్ట్రంలో కొవిడ్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో ఆఫ్‌లైన్ టికెట్ల జారీ ప్రక్రియను పునరుద్ధరించాలని టీటీడీ నిర్ణయించింది. 16వ తేదీ సర్వదర్శనం కోసం 15వ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు టోకెన్లు జారీ చేయనున్నట్టు అధికారులు తెలిపారు. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం కాంప్లెక్స్, శ్రీ గోవిందరాజస్వామి సత్రాల్లో ఏర్పాటు చేసే కౌంటర్ల ద్వారా టోకెన్లు జారీ చేయనున్నారు.
Source: EtvBharat





