NewsProgramms

విజయవాడ : మోకాళ్ళపై అమ్మ దర్శనానికి వచ్చిన యువకుడు

234views

మిక్రాన్ వేరియంట్ పెద్ద ఎత్తున వ్యాపించనున్నదని శర పరంపరగా వార్తలు వస్తున్నాయి. మీడియా పెద్ద ఎత్తున హడావుడి చేస్తోంది. అప్పటికే పలు దేశాలలో ఒమిక్రాన్ విజృంభిస్తోంది. ఆ సమయంలో విజయవాడలోని ఓ యువకుడు… భారతదేశంలో ఒమిక్రాన్ తీవ్రతను తగ్గించమని, ప్రజలను ఇబ్బందులపాలు చేయకుండా కాచుకోమని అమ్మలగన్నయమ్మ ఆ బెజవాడ కనకదుర్గమ్మవారికి మొక్కుకున్నాడు. కరోనా వ్యాప్తిని అరికట్టి ప్రజలను రక్షిస్తే కనకదుర్గ అమ్మవారి కొండమీదకు తాను మోకాళ్ళ మీద ఎక్కి వస్తానని మొక్కుకున్నాడు.

అతని పేరు నాగలింగం శివాజీ. మోడీ యువసేన నాయకుడు. విజయవాడ సత్యనారాయణపురం నివాసి. మొత్తానికి శ్రీ శివాజీ మొక్కుకున్నట్టే దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ పెద్ద ప్రభావమేమీ చూపలేదు. స్వల్ప లక్షణాలతో ప్రజలను పెద్ద ఇబ్బందులకు గురి చేయకుండానే వీడి పోయింది. అంతే మహదానందంతో తన మొక్కు తీర్చుకోవడానికి 12/2/2022 శనివారం, భీష్మ ఏకాదశి పర్వదినాన బయల్దేరాడు శివాజీ. మంచి పనికి మేమూ తోడంటూ మరికొందరు మహిళలు, ఇతర భక్తులు సైతం ముందుకు వచ్చారు. అనుకున్నట్టుగానే శివాజీ మోకాళ్ళ మీద మెట్లు ఎక్కుతూ ఉంటే… ఆ మాతృమూర్తులు ఆయనకు తోడుగా ఆ మెట్లకు పసుపు కుంకుమలు అద్దుతూ మెట్ల పూజ చేసుకుంటూ కాలినడకన కొండెక్కారు. అందరూ కలిసి ఆ అమ్మవారిని దర్శించుకుని ఆమె మహద్దర్శనంతో పులకించిపోయారు. ఆనందభాష్పాల మధ్య అమ్మవారిని దర్శించుకుని, ప్రజలను ఇక్కట్ల పాలు చేయకుండా కాపాడి కాచుకున్నందుకు ఆమెకు తమ దండాలతో కృతజ్ఞతలు తెలియజేసి ఆనందంగా వెనుదిరిగారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.