
480views
గుజరాత్: భారత సరిహద్దు జలాల్లోకి ప్రవేశించిన 11 పాకిస్తాన్ బోట్లను సరిహద్దు భద్రతా దళం స్వాధీనం చేసుకుంది. గుజరాత్‌లోని కచ్ జిల్లా హరమినాలా ప్రాంతంలో నిర్వహించిన సెర్చ్ ఆపరేషన్‌లో అధికారులు ఈ బోట్లను గుర్తించారు. ఈ పడవలు భారత జలాల్లోకి ఎందుకు ప్రవేశించాయన్న విషయంపై దర్యాప్తు చేపడుతున్నారు. ఆ బోటుకు సంబంధించిన వ్యక్తుల కోసం కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఘటనాస్థలంలో దట్టమైన చెట్లు ఉండటం, అలలు తీవ్రంగా ఉండటం వల్ల సైనికులకు గాలింపు చర్యలు చేపట్టడం సవాల్‌గా మారిందని అధికారులు పేర్కొన్నారు.





