News

జేఎన్‌యూ తొలి మ‌హిళా వీసీగా శాంతిశ్రీ పండిట్

531views

న్యూఢిల్లీ: జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా కేంద్రం ఆచార్య డి.శాంతి శ్రీ పండిట్ను నియమించింది. ప్రస్తుతం సావిత్రీబాయి పూలే వర్సిటీ ప్రొఫెసర్‌గా ఉన్న ఆమెకు జేఎన్యూ బాధ్యతలు అప్పగించింది. జేఎన్యూ వీసీగా మహిళా ప్రొఫెసర్ను నియమించడం ఇదే తొలిసారి. ఆమె నియామకానికి యూనివర్శిటీ విజిటర్‌గా ఉన్న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదం తెలిపారు.

శాంతి శ్రీ ఐదేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ వీసీగా ఉన్న ఎం.జగదీశ్ కుమార్ పదవీకాలం గతేడాది డిసెంబర్తో ముగిసింది. కొత్త వీసీ నియామకం వరకు తాత్కాలిక వీసీ బాధ్యతల్ని ఆయనకు అప్పగించారు. తాజాగా జగదీశ్ కుమార్ యూజీసీ ఛైర్మన్‌గా నియమితులవడంతో కేంద్రం శాంతి శ్రీని జేఎన్యూ వీసీగా నియమించింది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి