News

పాకిస్థాన్‌లోని హింగ్లాజ్ దేవి శక్తిపీఠంపై దాడులు

708views
  • జిత్తులమారి చైనా హస్తం?

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లో ఉన్న ప్రసిద్ధ హింగ్లాజ్ దేవి శక్తిపీఠం మరోసారి విధ్వంసానికి గురైన ఘటన చర్చనీయాంశంగా మారింది. కేవలం గత సంవత్సరంలో 22 సార్లు మతోన్మాద ముస్లింలు మందిరంపై దాడి చేశారు. దేశ విభజన తర్వాత 51 శక్తి పీఠాలలో ఆరు బంగ్లాదేశ్, పాకిస్తాన్‌కు వెళ్లాయి. భారతదేశంలో ఉన్న హిందువులను కలవరపాటుకు గురిచేయడానికి మతోన్మాద ముస్లింలు ఈ ఆరు శక్తిపీఠాల పై దాడి చేస్తూ ఉంటారు.

హింగ్లాజ్ దేవి మందిర విధ్వంసం కూడా ఈ దృష్టిలోనే చూడవలసి ఉంటుంది. ఇది కాకుండా నాలుగు శక్తిపీఠాలు చైనా – నేపాల్, శ్రీలంక అధీనంలో ఉన్నాయి. నేపాల్‌లో రెండు, చైనా ఆక్రమిత టిబెట్లో ఒక శక్తి పీఠం, ఇంకొకటి శ్రీలంకలో ఉన్నాయి. ప్రస్తుతం యావత్ భారతదేశంలో 41 ముఖ్య శక్తి పీఠాలు మిగిలాయి.

హింగ్లాజ్ మాతను హిందువులు, ముస్లింలు ఇద్దరూ పూజిస్తారు. బలూచిస్తాన్‌లోని ముస్లింలు హింగ్లా మాతను నాని అని పిలుస్తారు. హింగ్లాజ్ మాత ఆలయాన్ని “పాకిస్తాన్ వైష్ణో దేవి” అని కూడా పిలుస్తారు. మా హింగ్లాజ్ ఒక ఎత్తైన కొండపై ఉన్న గుహలో ఒక ఆస్థానాన్ని కలిగి ఉంది. విభజన అనంతరం హింగ్లాజ్ మాత ఆలయంపై పాకిస్తాన్ ఉగ్రవాదులు అనేకమార్లు దాడి చేసినప్పటికీ, అమ్మవారి విగ్రహానికి హాని జరగలేదు.

ఉగ్రవాదుల దాడి నుండి స్థానిక హిందువులు, ముస్లింలు కూడా అనేక సార్లు ఆలయాన్ని రక్షించారు. ఒకసారి ఆలయాన్ని విధ్వంసం చేసేందుకు వచ్చిన ముష్కరుల అందరూ గాలిలో కలిసి పోయారు. ఇక్కడి అమ్మవారి మహత్వం ముందు అందరూ తలవంచాల్సిందే.

ఇదిలావుండ‌గా, రెండేళ్ళుగా పాకిస్థాన్‌లో చైనా ఆధిపత్యం పెరిగిపోయిందని ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషనర్ కార్యాలయ అధికారి ఒకరు తెలిపారు. యురేనియం, స్ఫటికం, రూబీ, నీలమణి లాంటి విలువైన వస్తువులున్న మానస సరోవర్ ప్రాంతాన్ని చైనా స్వేచ్ఛగా పాలించాలనుకుంటోంది.

అందుకే భారత్‌ను రెచ్చగొట్టేందుకు పాకిస్థానీలకు పని కల్పిస్తోంది. కైలాష్ మానస సరోవర్ నుండి ఈ విలువైన పదార్థాలను వెలికి తీయడం కోసం భారతదేశాన్ని చిక్కుల్లో పడేసే ప్రయత్నం చేస్తోంది. హింగ్లాజ్ దేవి మందిరం పై తదేకంగా జరుగుతున్న దాడుల వెనుక ఉన్నది జిత్తులమారి చైనా.

Source: VSK Telangana

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి