News

రెండో రోజు ఘనంగా ప్రారంభమైన రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు

444views

భాగ్య‌న‌గ‌రం: సమతామూర్తి శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది వేడుకలు హైదరాబాద్‌ శివారు ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో వైభవంగా జరుగుతున్నాయి. 12 రోజుల ఈ మహాక్రతువులో తొలిరోజు జరిగింది. రెండో రోజు ఉత్సవాలు కన్నులపండువగా ప్రారంభమయ్యాయి.

శ్రీ లక్ష్మీ నారాయణ మహా క్రతువులో భాగంగా శమి, రావి కర్రలతో అగ్ని మథనం చేయనున్నారు. అగ్నిహోత్రంతో 1035 కుండలాల్లో హోమం చేయనున్న రుత్వికులు.. ఇందుకోసం యజ్ఞ కుండలాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఏకకాలంలో 5 వేల మంది రుత్వికులతో 1035 కుండలాల్లో హోమాలు నిర్వహించనున్నారు. ప్రవచన శాలలో వేద పండితులచే ప్రవచన పారాయణం ఉంటుంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి