News

ఘోరం… గోమాత‌ను వ‌ధించిన ముస్లింలు!

621views

మ‌ణిపూర్‌: మ‌ణిపూర్‌లో ఘోరం జ‌రిగిపోయింది. కొంత మంది ముస్లింలు ఉన్మాదుల్లా త‌యారై గోమాత‌ను వ‌ధించారు. నిందితులు అబ్దుల్ రషీద్, నజ్బుల్ హుస్సేన్, మహ్మద్ ఆరిఫ్ ఖాన్‌ల‌ను పోలీసులు అరెస్టు చేశారు. బీజేపీ జెండాపై ఆ యువకుల బృందం ఆవును వధించిన వీడియోలు సోషల్ మీడియా సైట్లలో కనిపించాయి. దీంతో 1960, జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టంలోని వివిధ సెక్షన్ల కింద వారిని అరెస్టు చేసి, కేసు నమోదు చేశారు. ఆ యువకులు మద్దతు ఇస్తున్న అభ్యర్థికి బీజేపీ టిక్కెట్ నిరాకరించడంతో ఈ దారుణానికి పాల్ప‌డ్డారు.

ఈ గుంపు మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్, బీజేపీ మణిపూర్ యూనిట్ ప్రెసిడెంట్ అధికారిమయుమ్ సర్దా దేవిని కూడా తిట్టారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ ఘటన వివిధ కులాలు, వర్గాల మధ్య గొడవకు కూడా కారణమయ్యే అవకాశం ఉంది. దీంతో ఇంఫాల్ వెస్ట్ జిల్లా పరిధిలోని లిలాంగ్ పోలీసు అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

మ‌ణిపూర్ అసెంబ్లీ ఎన్నిక‌లలో భార‌తీయ జ‌న‌తా పార్టీ ఒంటరిగానే ముందుకు వెళ్లాలని నిర్ణయించుకుంది. 60 అసెంబ్లీ స్థానాల్లోనూ పోటీ చేయాల‌ని నిర్ణ‌యించింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి భూపేంద‌ర్ యాద‌వ్ అధికారికంగా ప్ర‌క‌టించారు. మ‌ణిపూర్‌లో బీజేపీనే ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తుంద‌ని ఆయన ధీమా వ్య‌క్తం చేశారు. కొందరు ఆశావహులకు బీజేపీ టికెట్లు లభించకపోవడంతో ప్రధాని నరేంద్ర మోదీ, మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పార్టీ కార్యాలయాలను ధ్వంసం చేశారు. మ‌ణిపూర్ అసెంబ్లీకి రెండు ద‌శ‌ల్లో ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్టు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి