
కర్నూలు జిల్లాలో ధర్మజాగరణ సమితి ఆధ్వర్యంలో భారతమాత పూజా కార్యక్రమాలు ఊరూ, వాడ, పల్లె, గూడెం, బస్తీలలోని మారుమూల గృహాలను, ప్రజలను స్పృశిస్తూ అసమానంగా, అప్రతిహతంగా సాగిపోతున్నాయి.
అందులో భాగంగా 26.01.22 బుధవారం నాడు నంద్యాల మండలం అబాండం తండాలో బంజారా ధర్మరక్షా సమితి ఆధ్వర్యంలో భారత మాత పూజ /దర్తి యాడిరో పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో బంజారా ధర్మ రక్షా సమితి (BDRS) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ హథీరామ్ నాయక్, BDRS జిల్లా అధ్యక్షులు శ్రీ చందు నాయక్, శ్రీ కేశాలు నాయక్, శ్రీ సుబ్బానాయక్, శ్రీ నాగేంద్ర నాయక్, శ్రీ రమేష్ నాయక్, శ్రీ ముని నాయక్, శ్రీ కార్తీక్ నాయక్, శ్రీ చంద్ర నాయక్, శ్రీ స్వామి నాయక్, స్థానిక బంజారా బంధువులు కార్యక్రమంలో పాల్గొన్నారు. #
వక్తలు మాట్లాడుతూ యస్. సి, యస్. టి, బీ. సీ, ఓబీసి, మైనారిటీలంటూ రాగాలు తీస్తూ హిందువులను కులాల పేరుతో చీల్చే ప్రయత్నం చేస్తున్న విచ్ఛిన్నకర శక్తుల కుయుక్తులకు మోసపోవద్దని తెలిపారు. కులాలకతీతంగా హిందువులంతా ఏకమై భారతమాతను రక్షించుకోవలసిన సమయమాసన్నమైందని పిలుపునిచ్చారు.





