News

హిందూ యువ‌తి కిడ్నాప్‌, రేప్‌!

275views
  • నిందితుడు దిల్షాద్ హుస్సేన్‌ను కాల్చిచంపిన బాధితురాలి తండ్రి

గోర‌ఖ్‌పూర్‌: కిడ్నాప్‌, అత్యాచార కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తిని కోర్టు ఆవరణలోనే కాల్చి చంపాడు బీఎస్​ఎఫ్​ మాజీ జవాను. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని గోరఖ్​పుర్​లో జరిగింది. తన కూతురిపై అత్యాచారం చేశాడన్న ఆగ్ర‌హాంతోనే చంపిన‌ట్టు తెలుస్తోంది.

బీహార్​లోని ముజఫర్‌పుర్​కు చెందిన దిల్షాద్ హుస్సేన్ 2020 ఫిబ్ర‌వ‌రిలో బి.ఎస్.ఎఫ్ మాజీ జ‌వాన్ భ‌గ‌వ‌త్ నిషాద్ కుమార్తెను కిడ్నాప్ చేసి, అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. ఈ కేసు విచారణ నిమిత్తం​ హాజరయ్యేందుకు కోర్టు గేటు వద్దకు శుక్రవారం దిల్షాద్ చేరుకున్నాడు. అప్పుడే భగవత్​ నిషాద్​ త‌న ద‌గ్గ‌ర ఉన్న తుపాకీతో దిల్షాద్​ను కాల్చి చంపాడు. పోలీసులు భగవత్​ను అరెస్టు చేశారు. మృతదేహాన్ని పోస్ట్​మార్టంకు తరలించారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి