News

లవ్‌ జిహాద్‌కు మరో యువతి బలి!

762views
  • భార్య ఉండగానే హిందూ అమ్మాయితో రెండో పెళ్ళి

  • మతం మార్చి ‘జారా’గా పేరు మార్పు

  • హత్యచేసి, పరారైన మొహమ్మద్‌ యాసిన్‌

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో మరో లవ్‌ జిహాద్‌ వెలుగు చూసింది. అయితే, ఈసారి బాధితురాలు ప్రాణాలు దక్కించుకోలేక, నమ్మినవాడి చేతిలోనే హత్యకు గురైంది. ఆమె అసలు పేరు శివ విశ్వకర్మ. హిందువు. మొహమ్మద్‌ యాసిన్‌ అనే ముస్లిం యువకుడు భార్య ఉండగానే ఈమెను రెండో భార్యగా పెళ్ళి చేసుకున్నాడు. తర్వాత కొద్ది రోజులకే ఇస్లాంలోకి మార్చాడు. పేరు శివ విశ్వకర్మకు బదులుగా జారా ఖాన్‌(జారా అలియాస్‌ సోఫియా)గా మార్చాడు. మొహమ్మద్‌ యాసిన్‌ వృత్తి ఆయుర్వేద ఔషధాల సరఫరా. ఆమె, అతను బహ్రైచ్‌కు చెందినవారు.

పాత కాశీరాం కాలనీలోని వారి ఇంట్లోనే యాసిన్‌ ఈ నెల 20వ తేదీ గురువారం సాయంత్రం దిండుతో ఆమెపై దాడి చేసి, ఊపిరి ఆడకుండా కిరాతకంగా హత్య చేశాడు. అంతకుముందు భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. తమ మూడేళ్ళ అమ్మాయిని ఇంటి బయట వదిలిపెట్టి, ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసుకుని ఆమె ప్రాణాలు తీశాడు. లక్నోలోని పారా ప్రాంతంలోని కాశీరామ్‌ కాలనీలో ఈ దుర్ఘటన సంభవించింది. తర్వాత తమ మూడేళ్ళ బాలికను ఇంటి బయట ఉండగానే ఆ గదికి తాళం వేసి, పారిపోయాడు.

ఘటన వెలుగుచూసిందిలా…

జారా(శివ విశ్వకర్మ) సోదరుడు శరద్‌ ఆ రోజు ఆమెకు ఫోన్‌ చేశాడు. ఆమె ఫోన్‌ రిసీవ్‌ చేసుకోకపోవడంతో ఆందోళన చెంది, సోదరి ఇంటికి వెళ్ళాడు. వారి అమ్మాయి ఫ్లాట్‌ వెలుపల కూర్చుని ఏడుస్తోంది. శరద్‌ ఫ్లాట్‌ తలుపు తాళాలను పగులగొట్టి చూడగా, జారా మృతదేహాన్ని బెడ్‌రూమ్‌లో పరుపులో చుట్టి పడి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు, ఫోరెన్సిక్‌ బృందం ఘటనా స్థలాన్ని పరిశీలించింది. హంతకుడు యాసిన్‌ కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.

Source: OpIndia

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి