News

ఘనంగా గురు గోవింద్ సింగ్ జయంతి ఉత్సవాలు

600views
  • లక్షలాది మందికి ఆయన ధైర్యాన్నిచ్చారని కొనియాడిన మోడీ

న్యూఢిల్లీ: సిక్కుమత 10వ గురువు గురు గోవింద్​ సింగ్ 355వ​ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు . గురు గోవింద్ జీవిత సారాంశం లక్షలమందికి ధైర్యాన్నిస్తుందని ట్వీట్ చేశారు మోదీ.

ఈమేరకు గతంలో పట్నాలో గురుగోవింద్ సింగ్​కు నివాళులు అర్పించిన ఫోటోలను షేర్ చేశారు. గురు గోవింద్​ సింగ్​ జయంతి సందర్భంగా అందరికి శుభాకాంక్షలు. గురు జీవిత సారాంశం లక్షలమందికి ధైర్యాన్నిస్తుంది.

355వ ప్రకాశ్ పురబ్​ను ఘనంగా నిర్వహించేందుకు మా ప్రభుత్వానికి అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నామని మోడీ తెలిపారు. ప్రకాశ్ పురబ్​ను పురస్కరించుకుని దిల్లీలోని గురుద్వారా సిస్​గంజ్​ సాహిబ్ మందిరానికి తరలివస్తున్నారు. అటు పంజాబ్, అమృత్​సర్​లోని స్వర్ణదేవాలయానికీ భక్తుల తాకిడి పెరిగింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి